‘Rape చేసినోడినే పెళ్లి చేసుకోవాలి’ పై పార్లమెంటులో బిల్లు!

Submitted on 23 January 2020
‘Marry-your-rapist’ bill to be introduced by lawmakers in Turkey

ప్రస్తుత రోజుల్లో అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా అత్యాచార ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మనదేశంలో ఒకప్పుడు నిర్భయ ఘటన.. కొన్నినెలల క్రితం జరిగిన దిశ ఘటన వంటి ఎన్నో అత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో డిమాండ్ వినిపిస్తోంది. మహిళలు, చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన వారికి ఉరే సరి అనే డిమాండ్ వెల్లువెత్తుతోంది. 

వివాదాస్పదమైన ‘రేపిస్ట్ తో పెళ్లి’ బిల్లు :
ఇలాంటి పరిస్థితుల్లో మధ్య తూర్పు దేశమైన టర్కీలో అత్యాచార నిందితులను శిక్ష నుంచి తప్పించే ఓ కొత్త చట్టానికి రూపకల్పన చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి టర్కీ పార్లమెంటులో ఓ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. 18ఏళ్ల లోపు చిన్నారులతో లైంగిక సంబంధం కలిగినా లేదా అత్యాచారానికి పాల్పడిన నిందితులకు ఇది వర్తిస్తుంది. అంటే.. శిక్ష నుంచి మినహాయింపు పొందాలంటే.. తప్పనిసరిగా అత్యాచార బాధితులను నిందితులు పెళ్లి చేసుకునేలా ఈ బిల్లును చట్టసభ సభ్యులు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పుడు టర్కీలో ఈ బిల్లు వివాదాస్పదానికి దారితీసింది. జనవరి నెలాఖరులోగా ఈ ‘మ్యారీ యూవర్ రేపిస్ట్’ అనే బిల్లును టర్కీ పార్లమెంటులో ప్రవేశపెట్టేలా చట్టసభ సభ్యులు ప్లాన్ చేస్తున్నారు. మహిళ హక్కుల ప్రచారకర్తలు ఎక్కువగా ఉన్న దేశంలో ఇప్పుడు దీనిపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత నెలకొంది. 

2016లోనే వీగిపోయిన మరో బిల్లు :
ఈ చట్టాన్ని విమర్శలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బాల్య వివాహం, చట్టబద్ధమైన అత్యాచారాలను చట్టబద్ధం చేయడమే కాకుండా, పిల్లల దుర్వినియోగం, లైంగిక దోపిడీకి కూడా మార్గం సుగమం చేస్తుందని ప్రతిపక్ష పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (HDP) ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ బిల్లును ప్రవేశపెట్టరాదంటూ డిమాండ్ చేసింది. 2016లో కూడా ఇలాంటి బిల్లు పార్లమెంటులో వీగి పోయింది. దేశం, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత నెలకొనడంతో ఆ బిల్లు విగిపోయింది. ఈ చట్టం పురుషులు ‘బలవంతం లేదా బెదిరింపు’ లేకుండా లైంగిక సంబంధం కలిగి ఉంటే మాత్రమే క్షమించేదిగా ఉండాలి. ఈ బిల్లుపై ఐక్యరాజ్య సమితి సంస్థలు సైతం తీవ్రంగా తప్పుబట్టాయి. పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడే అవకాశాలను సృష్టిస్తుందని, బాధితులను దుండగుల నుంచి మరిన్ని లైంగిక బెదిరింపులను ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించింది.

వివక్షత బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు :
మహిళలు, బాలికల హక్కులను ప్రోత్సహించడమే లక్ష్యంగా పనిచేసే ప్రభుత్వేతర సంస్థ అయిన మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లలో సమానత్వాన్ని బోధించే ప్రత్యేకత కలిగిన ప్రచారకుడు సుద్ అబూ-దయ్యే మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నది షాకింగ్ గా ఉందని అన్నారు. పిల్లల లైంగిక దోపిడీకి పాల్పడేవారికి శిక్ష మినహాయింపును అందించేలా బిల్లును తీసుకురావడం సరైనది కాదని చెప్పారు.  ఈ వివక్షత బిల్లుకు వ్యతిరేకంగా టర్కీలోని మహిళా హక్కుల ప్రచారకులంతా ధైర్యంగా తమ నిరసన గళాన్ని వినిపించినందుకు వారిని తాను అభినందిస్తున్నట్టు ఆయన తెలిపారు.

బాలికలకు ప్రస్తుత చట్టపరమైన రక్షణలను తొలగించాలని ప్రయత్నించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరుతానని అన్నారు. "మహిళా హక్కుల కార్యకర్తలు, చట్టసభ సభ్యులు, ఈజిప్ట్, జోర్డాన్, లెబనాన్, మొరాకో, ట్యునీషియా పాలస్తీనాలు తమ ప్రచారాలతో ఇలాంటి లూప్ హోల్స్ ను తొలగించాయి. మహిళల హక్కులు రక్షణలకు హాని కలిగించే చట్టాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నించకుండా, టర్కీ చట్టసభ సభ్యులు లింగ వివక్షత చట్టాలను రద్దు చేయడంలో పురోగతిపై ఆలోచించాలని కోరారు.

లైంగిక హింసకు గురైన 38 శాతం మహిళలు :
టర్కీలో చట్టబద్ధమైన వయస్సు 18 అయితే, బాల్య వివాహంపై 2018 ప్రభుత్వ నివేదిక ప్రకారం.. గత దశాబ్దంలో మొత్తం 482,908 మంది బాలికలు వివాహం చేసుకున్నారు. టర్కీలో మహిళలు బాలికలపై హింస ప్రబలంగా ఉంది. ఐక్యరాజ్యసమితి డేటా ప్రకారం.. 38 శాతం టర్కీ మహిళలు భాగస్వామి నుంచి శారీరక లేదా లైంగిక హింసకు గురయ్యారు. 2014 లో ఇస్తాంబుల్‌లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో పురుషులు మహిళల మధ్య సమానత్వం “ప్రకృతికి వ్యతిరేకం” అని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ అన్నారు. మీరు స్త్రీలను పురుషులను సమాన స్థావరంలో ఉంచలేరు. ఇది ప్రకృతికి విరుద్ధమని చెప్పారు. 

Marry-your-rapist
Marry rapist bill
LAWMAKERS
Turkey   

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు