ఇక్కడ ఒక్కపెళ్లికే : రెండు పెళ్లిళ్లు చేసుకోకపోతే జైలు.. ఐదుగురిని చేసుకుంటే ఫ్రీగా ఇల్లు

Submitted on 14 May 2019
Marry More Than Two Wives Or Face Jail Declares King Mswati

స్త్రీల కంటే పురుషుల సంఖ్య పెరిగిపోవడంతో మనదేశంలో పెళ్లికాని యువకుల సంఖ్య ఎక్కువవుతుంటే.. ఆ దేశంలో మాత్రం ఒక్కక్కరు కనీసం ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ ఓ రాజు ఆదేశాలు జారీ చేశారు.

ఆప్రికా ఖండంలోని స్వాజిలాండ్ దేశంలో మైనారిటీ తీరిన ఒక్క అబ్బాయి కనీసం ఇద్దరిని పెళ్లి చేసుకోవాలంటూ అక్కడి రాజు మెస్వాతి III సంచలన ప్రకటన చేశారు. 2019 జూన్ నుంచి ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని ప్రకటించారు. రెండు పెళ్లిళ్లు చేసుకోకపోతే ఆ అబ్బాయిలకు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఉత్సాహం ఉండి ఐదు పెళ్లిళ్లు చేసుకునేవారికి.. ప్రభుత్వమే ఇళ్లు కూడా కట్టిస్తుందంటూ బంపరాఫర్ ప్రకటించారు రాజు మెస్వాతి.

ఇదిలా ఉంటే రాజు మెస్వాతికి ఇప్పటికే 15మంది భార్యలు, 25 మంది సంతానం ఉన్నారు. అలాగే ఆయన తండ్రికి 70మందికి పైగా భార్యలు, 150మంది సంతానం ఉన్నారు. ఆఫ్రికన్ దేశాల్లో 'పెళ్లి'ని పెద్ద ఘనకార్యంగా భావిస్తారు. ఎక్కువ మంది మహిళలను పెళ్లి చేసుకోవడం ద్వారా కుటుంబం అభివృద్ధి చెందుతుందని నమ్ముతారు. 

రెండు పెళ్లిళ్లు చేసుకోవాలని ప్రభుత్వమే ఆదేశించటం, లేకపోతే జైలు శిక్ష అని చట్టం చేయటం వెనక ఓ విషయం ఉంది. స్వాజిలాండ్ దేశంలో అబ్బాయిలు కంటే అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉంది. చాలా మంది అమ్మాయిలు పెళ్లి కాకుండా వృద్ధులు అయిపోతున్నారు. అబ్బాయిలు దొరక్క.. కన్యలుగా మిగిలిపోతున్నారు. దీని వల్ల దేశ జనాభా కూడా తగ్గిపోతుంది. స్త్రీ-పురుష నిష్పత్తి అంతకంతకూ పెరిగిపోతూ సమతుల్యం దెబ్బతింటుంది. అమ్మాయిలకు పెళ్లిళ్లు కావటం కోసం.. దేశ జనాభా వృద్ధి కోసం ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు రాజు మెస్వాతి III

Marry More Than Two Wive
Jail
King Mswati

మరిన్ని వార్తలు