బస్సుపై కాల్పులు : చత్తీస్‌గ‌ఢ్‌లో రెచ్చిపోయిన మావోలు 

Submitted on 16 January 2019
maoists firing

రాయ్ పూర్: చత్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రంలోని  దంతెవాడ జిల్లా కేంద్రంలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. కస్సోలీ CRPF క్యాంపుకు కిలోమీటర్ దూరంలో ఒక బస్సుపై మావోయిస్టులు కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. ప్రమాద సమయంలో బస్సు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

బస్సులో ప్రయాణిస్తున్న దంతేవాడ జిల్లా పంచాయితీ సభ్యుడు చైత్రం అటామి లక్ష్యంగా  మావోలు  కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, CRPF బెటాలియన్ దళాలు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టాయి.

maoist
Chhattisgarh
firing
CRPF Camp

మరిన్ని వార్తలు