'మ‌న్మ‌థుడు 2' తొలి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

Submitted on 21 July 2019
manmadhudu 2 first lyrical video song revealed

అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంట గా నటిస్తున్న మన్మథుడు  2 ... రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో  తెర కెక్కుతున్న రోమాంటిక్ ఎంటర్ టైనర్.  16 ఏళ్ల క్రితం కె. విజయభాస్కర్ దర్శకత్వంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది మన్మథుడు. ఈ సినిమా ఉత్తమ చిత్రంగా రాష్ట్ర  ప్రభుత్వ నంది అవార్డును కూడా అందుకుంది. మన్మథుడు సినిమాకు సీక్వెల్ గా వస్తున్నఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్ గా నటిస్తుండగా..సమంత, కీర్తి సురేశ్‌ కీలక పాత్రలు పోషించారు. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్ (జెమిని కిర‌ణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే టీజర్లు తో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు మొదలెట్టేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా టీజర్స్‌కు ప్రేక్షకులనుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 9న సినిమా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ బిజీ బీజీ గా ఉంది.  తాజాగా ఈ సినిమాలోని మొదటి పాటను  ఆదివారం జులై 21 సాయంత్రం  విడుదల చేశారు. హే మెనీనా..ఐ సీయూ వాన్న లవ్ అంటూ సాగే ఈ పాటలో నాగ్ మరోసారి లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు.

శుభమ్ విశ్వనాధ్ సాహిత్యం అందించిన ఈ పాటను చేతన్ భరద్వాజ్ సంగీతం అందించడంతో పాటు స్వయంగా పాడారు. ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది.  ఫారెన్ భామలతో రొమాన్స్  చేసే ఈ పాటలో నాగార్జునను చూస్తే.. నాగ్ ఏజ్.. 60 అంటే అసలు నమ్మబుద్ది కావడం లేదు.

film
Akkineni Nagarjuna
Rakul Preet Singh
Manmadhudu 2
Cinema
Samantha

మరిన్ని వార్తలు