పోలార్ వోర్టెక్స్ ట్రిక్: బెడిసి కొట్టింది.. ఒళ్లు కాలింది 

Submitted on 5 February 2019
Man tries viral Polar Vortex boiling water trick. Gets burnt on video, roasted on YouTube

అమెరికాలో మైనస్ 50డిగ్రీల ఉష్ణోగ్రత వణికిస్తోంది. నీళ్లు గడ్డ కట్టేస్తున్నాయి. టాయ్ లెట్ లోని వాటర్ కూడా మంచుగా మారిపోతుంది. మైనస్ 50 డిగ్రీల వేడినీళ్లు వెంటనే గడ్డకట్టేస్తున్నాయి. యూఎస్ లో జనమంతా మంచుగడ్డలను మరిగిస్తున్నారు. బయట ఆరవేసిన బట్టలు కూడా మంచుకు గడ్డకట్టి నిట్టనిలువుగా నిలబడిపోతున్నాయి. అంతటి గడ్డకట్టే పరిస్థితిలో యూఎస్ ప్రజలు జీవిస్తున్నారు. అయినా ఎంతమాత్రం ఆందోళన చెందకుండా సరదా కోసం పోలార్ వోర్టెక్స్ ట్రిక్స్ ఫాలో అవుతున్నారు.


ఒకవైపు గడ్డకట్టే వాతావరణం వణికిస్తుంటే.. మరోవైపు మరిగే వేడినీళ్లను గాల్లోకి విసరడం.. వేడి నీళ్లు గాల్లోనే గడ్డకట్టడం చూసి సందడి చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఇదే ట్రెండ్. ఎక్కడ చూసిన అందరూ ఈ 2019 పోలార్ వోర్టెక్స్ ట్రిక్స్ నే అప్లయి చేస్తున్నారు. మరిగే నీళ్లు ఒంటిపై పడితే ఏమైనా ఉందా? తాట ఊడిపోవాల్సిందే. అంతగా ఓ గిన్నెలో నీటిని బాయిల్ చేసి అమాంతం గాల్లోకి విసిరేస్తున్నారు. గాల్లో ఉష్ట్రోగ్రత శాతం జీరో డిగ్రీల కంటే తక్కువగా ఉండటంతో మరిగే వేడి నీళ్లు కూడా ఫ్రీజ్ అయిపోతున్నాయి. సోషల్ మీడియాలో వీడియోలు పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు ఆ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.


అందరిలాగే క్రిస్ కేగర్ అనే వ్యక్తి కూడా పోలార్ వోర్టెక్స్ ట్రిక్స్ ను ట్రై చేశాడు. అనుకున్నట్టుగానే నీటిని బాగా మరిగించాడు. ఓ గిన్నెలో మరిగే నీళ్లను బయటకు తీసుకొచ్చి ఇంటి ముందు గాల్లోకి విసిరాడు. అంతే.. గాల్లోకి వెళ్లిన వేడినీళ్లు వెంటనే గడ్డ కట్టగా.. గిన్నెలో ఒలికిన నీళ్లు కాస్త వెనుక కాలిపై చిందిపడ్డాయి.


అంతే.. అయ్య బాబోయ్.. మంట.. కాలింది అంటూ ఎగిరి గంతేశాడు. మరిగే నీళ్లు ఒంటిపై పడటంతో తాట ఊడిపోయింది అతడికి. అందుకే ప్రమాదకరమైన విన్యాసాలు చేసేటప్పుడు జర జాగ్రత్తగా ఉండాలి. లేదంటే.. ఇలానే ఒళ్లు కాల్చుకోవాల్సి వస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 15 సెకన్ల నిడివి ఉన్న స్లో మోషన్ వీడియోను యూట్యూబ్ లో పోస్టు చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారింది.

Polar Vortex
boiling water trick
Youtube
Chris Kieger

మరిన్ని వార్తలు