వీడెవడండి బాబూ : అన్నంలో వెంట్రుక వచ్చిందని భార్యకి గుండు కొట్టాడు

Submitted on 8 October 2019
Man Shaves Wife's Head After Finding Hair In Food

బంగ్లాదేశ్‌లోని జాయ్‌పుర్హత్ జిల్లాలో దారుణం జరిగింది. ఆహారంలో వెంట్రుక వచ్చిందని ఓ భర్త వికృతంగా ప్రవర్తించాడు. భార్యకి గుండు కొట్టాడు. నిర్లక్ష్యానికి ఇదే తగిన శిక్ష అని తన చర్యని సమర్థించుకున్నాడు. ఆ భర్త పేరు బబ్లూ మొండల్(35). ఎప్పట్లాగే ఉదయం బ్రేక్ ఫాస్ట్ పెట్టింది భార్య. పాలు, అన్నం అతడి ముందు ఉంచింది. అయితే ఆ ఆహారంలో పొడవాటి వెంట్రుక వచ్చింది. దీంతో భర్త బబ్లూ కోపంతో ఊగిపోయాడు. భార్య నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగింది అంటూ.. ఆమెతో గొడవ పడ్డాడు. ఆ తర్వాత బ్లేడ్ తీసుకుని వచ్చాడు. ఆమెకి గుండు కొట్టాడు.

గుండు వద్దని ఎంత వేడుకున్నా భర్త వినలేదు. బలవంతంగా శిరోముండనం చేశాడు. ఈ ఘటన బంగ్లాదేశ్‌లో సంచలనం రేపింది. మహిళా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఆ భర్తను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆందోళనకు దిగాయి. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. గృహహింస నేరం కింద బబ్లూని అరెస్ట్ చేశారు.

ఈ కేసులో శిక్షకు గురైతే గరిష్ఠంగా 14 ఏళ్ల జైలు జీవితం గడపనున్నాడు భర్త బబ్లూ. మహిళా రక్షణకు చట్టాలున్నా వారిపై వేధింపులు, అణచివేతలు జరుగుతున్నాయనడానికి ఈ ఘటన ఓ నిదర్శనమని హక్కుల సంఘాల నేతలు వాపోయారు. ఆ భర్త చేష్టతో స్థానికులు విస్తుపోయారు. చిన్న విషయానికి ఇంత పెద్ద శిక్షా అని ఆశ్చర్యపోయారు. వంట చేసే సమయంలో అప్పుడప్పుడు ఇలా జరుగుతుందని మహిళలు అంటున్నారు. ఇలాంటి భర్తని ఏం చేసినా పాపం లేదన్నారు.

man
Shaves Wife
head
Hair In Food
bangladesh

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు