అండర్ వాటర్ టాస్క్ :  2 నిమిషాల్లోపే రూబిక్ క్యూబ్ పజిల్ ఛేదించాడు

Submitted on 20 May 2019
Man Sets World Record, Solves Nine Rubik's Cubes Under Water In Less Than Two Minutes

రూబిక్ క్యూబ్.. పరిచయం అక్కర్లేని పజిల్ గేమ్. ఇందులో మాస్టర్ కావాలంటే.. ఎన్నో ఏళ్ల ప్రాక్టీస్ తో పాటు ఏకాగ్రత, అంకితభావం ఉండాలి. అప్పుడే అతి తక్కువ సమయంలో క్యూబ్ పజిల్ ఛేదించడం సాధ్య పడుతుంది. తొమ్మిది క్యూబ్ లను ఒకే రంగు కలిసేలా సెట్ చేయాలి. ఎటు చూసిన 9 కలర్లు సేమ్ ఉండాలి. సాధారణంగా గంటల కొద్ది ప్రాక్టీసు చేసినా క్యూబ్ సాల్వ్ చేయలేక చాలామంది మధ్యలోనే చేతులేత్తేస్తుంటారు. ఎంతో కష్టమైన ఈ క్కూబ్ పజిల్ గేమ్ ను.. అత్యంత తక్కువ సమయంలో పరిష్కరించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడో వ్యక్తి. ఎక్కడ అనుకున్నారు.. 

ఒక నిమిషం.. 48 సెకన్లలో :
అందరిలా మాములుగా కాదు.. నీటి అడుగు భాగంలో కూర్చొని.. షాక్ అయ్యారా? మీరే కాదు.. ఆ టాస్క్ ను ప్రత్యక్షంగా చూసిన ప్రతిఒక్కరూ ఆశ్చర్యపోయారు. అతడు ఎవరో కాదు.. ముంబైకి చెందిన చిన్మయ్ ప్రభు. స్విమ్మింగ్ పూల్ లోని నీటి అడుగు భాగంలో కూర్చొని.. కేవలం 1 నిమిషం 48 సెకన్లలో రూబిక్ క్యూబ్ ను ఛేదించి వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. నిజానికి.. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నమోదు చేయాలంటే.. ప్రభు.. రూబిక్ క్యూబ్ 4 ఫిరామైనెక్స్ కంప్లీట్ చేస్తే చాలు.. కానీ, ఇతగాడు 9 ఫిరామైనెక్స్ ను కంప్లీట్ చేసి తిరుగులేదని నిరూపించాడు. ఈ టాస్క్ ను చిన్మయ్ 2018, డిసెంబర్ లో సాధించగా.. 2019, మార్చి 15న గిన్నిస్ సర్టిఫికేట్ అందుకున్నాడు.


గిన్నీస్ రికార్డు కోసమే ఇలా :
2015 నుంచి ప్రభు.. రూబిక్ క్యూబ్ పజిల్ గేమ్ ఛేదిస్తున్నాడు. ప్రపంచ రికార్డు నమోదు చేయడంపై చిన్మయ్ మాట్లాడుతూ.. ‘నాకు క్యూబింగ్ ఆడటమన్నా.. స్విమ్మింగ్ చేయడమన్నా ఎంతో ఇష్టం. రెండెంటినీ కలిపి ఒకేసారి చేయడం ద్వారా రికార్డు క్రియేట్ చేసేలా చేసింది. నీటి లోపల కూర్చొని క్యూబింగ్ సెట్ చేసి గిన్నిస్ బుక్ టైటిల్ క్రియేట్ చేయమని అడిగారు. ఇలా టైటిల్ గెలిచినవారు తమ జాబితాలో గిన్నీస్ విజేతల జాబితాలో ఎవరూ లేరని ప్రభు సంతోషం వ్యక్తం చేశారు. ‘ప్రారంభంలో నీటి అడుగున 30-35 సెకన్లు మాత్రమే ఉండగలిగాను. క్రమంగా నీటిలో శ్వాస కేపాసిటీని పెంచుతూ అర నిమిషం నుంచి ఒక నిమిషం వరకు తీసుకెళ్లాను’ అని తన ఐదేళ్ల క్యూబ్ పజిల్ గేమ్ జర్నీ గురించి రివీల్ చేశాడు. 

నీటి అడుగు భాగంలో కూర్చొని నేను.. కేవలం మూడు లేదా నాలుగు మాత్రమే క్యూబ్ సెట్ చేసి ఉంటే.. మరొకరు ఏదో ఒక రోజున నా రికార్డును బ్రేక్ చేస్తారు. అందుకే నేను 9 ఫిరామైనెక్స్ ఛేదించాను. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఐదు నెలల పాటు ట్రైనింగ్ తీసుకున్నాను’ అని చెప్పాడు. ప్రస్తుతం.. ప్రభు.. కోచింగ్ సెంటర్లను ప్రారంభించాడు. వీకెండ్ సమయాల్లో చాలామందికి క్యూబిక్ ఎలా సెట్ చేయాలో నేర్పిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. 

Mumbai Man
 World Record
Nine Rubik's Cube
Under Water
 Less Than Two Minutes
Guinness Book of World Records
Chinmay Prabhu

మరిన్ని వార్తలు