ధోనీ పరిగెత్తించిన విషయాన్ని గుర్తు చేసుకున్న కోహ్లీ

Submitted on 12 September 2019
This man, made me run like in a fitness test: Virat Kohli pays tribute to MS Dhoni

వరల్డ్ టీ20 మ్యాచ్‌లో కోహ్లీని దారుణంగా పరుగెత్తించాడట. ఎంతలా అంటే ఫిట్‌నెస్ టెస్టులో పాసవడానికి ఎంత పరిగెత్తాలో అలా అని గుర్తు చేసుకున్నాడు. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ కామెంట్‌తో పోస్టు చేశాడు. 'ఓ గేమ్ నేనెప్పటికీ మర్చిపోలేను. అదొక ప్రత్యేకమైన రోజు. ఫిట్‌నెస్ టెస్టులో పరుగెత్తించినట్లు అనిపించింది' అని పేర్కొన్నాడు. 

161పరుగుల లక్ష్య చేధనలో భాగంగా సింగిల్స్, డబుల్స్ తీసుకుంటూ కోహ్లీ-ధోనీ భాగస్వామ్యం విజయానికి చేరువయ్యారు. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ధోనీ ట్రిబ్యూట్ తెలియజేశాడు. అదొక స్పెషల్ నైట్ అని గుర్తు చేసుకున్నాడు. 

ఆ మ్యాచ్‌లో కోహ్లీ 51బంతుల్లో 82పరుగులు చేశాడు. ఫలితంగా సెమీ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియాను భారత్ 6వికెట్ల తేడాతో ఓడించింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 9ఫోర్లతో, 2సిక్సులతో 19.1ఓవర్లలో భారత్ 4వికెట్ల నష్టానికి 161పరుగులు చేసింది. ఆస్ట్రేలియా 6వికెట్లు నష్టపోయి 160 పరుగులు చేసింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A game I can never forget. Special night. This man, made me run like in a fitness test ? @mahi7781 ??

A post shared by Virat Kohli (@virat.kohli) on

fitness test
Virat Kohli
tribute
MS Dhoni

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు