వేశ్యతో హోటల్‌కు వెళ్లాడు: 12ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

Submitted on 28 April 2019
Man jailed 12 years for removing condom

నైరుతి ఇంగ్లాండ్‌లోని డోర్సెట్‌లో లీ హొగ్బెన్ అనే వ్యక్తికి 12ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. అయితే అతను చేసిన తప్పు తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవును చేసినది తప్పు శిక్ష అనుభవించాల్సిందే అని కోర్టు అతనికి కఠినమైన శిక్ష విధించింది.

వివరాల్లోకి వెళ్తే.. లీ హొగ్బెన్ అనే వ్యక్తి ఓ హోటల్‌కి 20ఏళ్ల వేశ్యతో కలిసి వెళ్లాడు. అయితే వెళ్లే ముందే వేశ్య అతనికి ఒక కండీషన్ పెట్టింది. శృంగారంలో పాల్గొనే సమయంలో కచ్చితంగా కండోమ్ వాడాల్సిందేనని, కండోమ్ లేకుండా శృంగారంలో పాల్గొనకూడదని ముందే చెప్పింది. 

ఆ కండీషన్‌కు ఒప్పుకున్న  లీ హొగ్బెన్ తీరా హోటల్‌కు వెళ్లాక శృంగారం చేసే సమయంలో కండోమ్ తీసి శృంగారం చేశాడు. ఎంత చెప్పినా వినకుండా కండోమ్ తీసి శృంగారం చేయడంతో ఆమె అతనిపై పోలీసులకి ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని అరెస్ట్ చేసి అత్యాచారం కేసు పెట్టారు పోలీసులు. అత్యాచార కేసు పెట్టాక డీఎన్ఏ ఆధారాలు సరిపోవడంతో కోర్టు అతనికి 12ఏళ్ల శిక్ష విధించింది.

man
Removed condom
consensual sex
Prostitute
12 years jail

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు