ఇసుకే బహుమతి: కొత్త జంటకు పెళ్లి కానుకగా!

Submitted on 11 November 2019
Man Gifts Sand for newly married couple in Anakapalli

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఇసుక కొరత ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భవన నిర్మాణ కార్మికులు కూడా ఈ ఇసుక కొరత కారణంగా పనులు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇసుక దొరకటమే గగనం అయిపోయింది. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా ఓ జంట పెళ్లి జరగగా ఆ పెళ్లికి వచ్చిన వ్యక్తి ఇచ్చిన గిఫ్ట్ గురించి ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లి మండలం కొత్తతలారివానిపాలెంలో అప్పుడే పెళ్లి అయిన వధూవరులకు ఓ యువకుడు డబ్బాడు ఇసుకను బహుమానంగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అనకాపల్లి మండలం కొత్తతలారివానిపాలెం గ్రామంలో మామిడి పూర్ణచంద్రరావు, భారతిలకు పెళ్లి జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన తెలుగు యువత గ్రామ అధ్యక్షుడు తలారి కాశీ నాయుడు నూతన వధూవరులకు ఇసుకతో నింపిన ఓ డబ్బాను బహూకరించాడు.

మార్కెట్‌లో కొనుగోలు చేయడానికి ఇసుక తప్ప  బంగారం, వెండి మిగిలిన వస్తువులు అన్నీ అందుబాటులో ఉన్నట్లు చెప్పిన ఆయన ఇసుకను బహుకరిస్తున్నట్లు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఇసుక కొరత ఎంతో తీవ్రంగా ఉందని, ఈ విషయాన్ని తెలియజేసేందుకే ఇసుకను బహుమతిగా ఇచ్చినట్టు వెల్లడించారు కాశీ నాయుడు. వివాహ సమయంలో వధూవరుల బంధువులు, స్నేహితులు పెళ్లి కానుకగా నగదు, గృహోపకరణ సామగ్రి ఇస్తుంటే కాశీ నాయుడు మాత్రం ఇసుక ఇచ్చారు. 

Man Gifts Sand
Newly married couple
anakapalli

మరిన్ని వార్తలు