ట్విట్టర్‌లో ట్రెండ్ : ‘మంచు కారు’ ఎంత బాగుందో!

Submitted on 21 January 2020
Man builds ‘car’ out of snow in Kashmir, detailing will surprise you

కారు కాని కారు.. ఇదో మంచు కారు.. సోషల్ మీడియాలో ఈ కారు ట్రెండ్ అవుతోంది. పూర్తిగా మంచుతో నిర్మించిన ఈ కారు నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. ట్విట్టర్ లో ఇదే లేటెస్ట్ టాపిక్ గా మారిపోయింది. కశ్మీర్ కు చెందిన జుబెయిర్‌ అహ్మద్ అనే వ్యక్తి ఈ మంచు కారును క్రియేట్ చేశాడు. తన సృజన్మాతక కళతో అందంగా కారును తీర్చిదిద్దాడు.

వింటర్ సీజన్ కావడంతో కశ్మీర్ లో భారీగా మంచు కురుస్తోంది. రోడ్లన్నీ మంచుతో నిండిపోయాయి. ఇదే సమయాన్ని తన కళకు పదును పెట్టాలనుకున్నాడు. తన క్రియేటివిటీని ప్రపంచానికి చాటిచెప్పేలా చేయాలని అనుకున్నాడు. పూర్తిగా మంచు నుంచి ఈ కారు మోడల్ రూపొందించాడు.

అహ్మద్ కళాత్మక దృష్టిని అందరూ మెచ్చుకుంటున్నారు. అహ్మద్ కళాత్మక వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అద్భుతమైన కళాత్మక దృశ్యాలను చూసిన ప్రతిఒక్కరూ అహ్మద్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అహ్మద్ కు చిన్నప్పటి నుంచి మంచుతో ఇలాంటి మోడల్స్ క్రియేట్ చేస్తుండేవాడు.

మంచు కారును తయారు చేయడం ఇది తొలిసారి కాదు.. గతంలో కూడా ఇలాంటివి ఎన్నో మంచుతో క్రియేట్ చేసి స్థానికులను ఆశ్చర్చపరిచేవాడు. దీనిపై అహ్మద్ మాట్లాడుతూ.. ‘మంచుతో ఏదైనా ఆకృతిని సులభంగా నిర్మించగలను. తాజ్ మహాల్ కూడా నిర్మిస్తాను.

నాకు కొన్ని వనరులు అవసరమైతాయి అంతే’ అని మీడియాకు వెల్లడించాడు. ప్రపంచ దృష్టిని ఆకర్షించే దిశగా మరిన్ని స్నో క్రియేషన్స్ చేయాలని ఆకాంక్షించాడు. కళాకారుడి అందమైన కళాకృతిని చూసి ప్రతిఒక్కరూ మెచ్చుకోకుండా ఉండలేరు. అంతేకాదు.. అహ్మద్ మంచుతో చేసిన కళాఖండాలను.. ప్రముఖ శాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్టిస్ట్ సుదర్శన్ పట్నాయక్ కు ట్విట్టర్ యూజర్ ఒకరు ట్యాగ్ చేశారు. ఈ యువ ఆర్టిస్ట్ మీకో గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నాడు చూడండి అంటూ ట్వీట్ చేశాడు.

Snow car
Kashmir
Zubair Ahmad
Snowfall
Sudarsan Pattnaik

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు