మెట్రో స్టేషన్ లో యువకుడు అత్మహత్యాయత్నం

Submitted on 11 January 2019
Man Attempts Suicide Jumping front bangaluru metro train services disrupted

ప్రయాణికులతో మెట్రో స్టేషన్ కిటకిటలాడుతోంది. ప్లాట్ ఫాంపై ప్రయాణికులంతా మెట్రో రైలు కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో ప్లాట్ ఫాంపైకి మెట్రోరైలు వచ్చింది. ప్రయాణికులు ఎక్కేశారు. ట్రైన్ బయల్దేరింది. సడన్ గా ఓ యువకుడు మెట్రో రైలు ముందు దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. లోకో పైలట్ ను ప్రయాణికులు అప్రమత్తం చేయడంతో సడన్ బ్రేక్ వేశాడు. యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన ఎక్కడో కాదు.. బెంగళూరులోని యలచెనహల్లి నుంచి బయల్దేరిన మెట్రో రైలు నాగసంద్ర మెట్రో స్టేషన్ లో చోటుచేసుకుంది. 

గంటపాటు నిలిచిపోయిన మెట్రో సర్వీసులు..
ఈ ఘటనలో యువకుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని విక్టోరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. యువకుడు ఎవరూ అనేది ఇంకా తెలియలేదు. యువకుడి ఆత్మహత్యాయత్నం ఘటనతో మెట్రో రైలు సర్వీసులకు గంటపాటు అంతరాయం ఏర్పడింది. కాసేపటి తరువాత మళ్లీ సర్వీసులు యథాతధంగా నడిచినట్టు పోలీసులు తెలిపారు.

బెంగళూరు మెట్రో స్టేషన్లో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండో సారి. 2012లో 16ఏళ్ల యువకుడు ఎమ్ జీ రోడ్ మెట్రో స్టేషన్ ల్లో రైలు వెళ్తుండగా ట్రాక్ పై దూకేశాడు. ఈ ఘటనలో ఆ యువకుడు అక్కడిక్కడే మృతిచెందాడు. అప్పటి నుంచి మెట్రో అధికారులు ప్రతి మెట్రో స్టేషన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.  

Suicide
bangalore metro station
Metro train
train services
young man

మరిన్ని వార్తలు