కట్ చేస్తే : గాఢ నిద్రలో డ్రైవర్.. హైవేపై 90 స్పీడులో టెస్లా కారు

Submitted on 11 September 2019
Man Asleep At Wheel As Self-Driving Tesla Speeds At 90 Kmph

హైవేపై ఓ కారు 90కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తోంది. ఆ కారులోని డ్రైవర్ స్టీరింగ్ పై తలపెట్టి హాయిగా నిద్ర పోతున్నాడు. కారు వేగం ప్రమాదకరంగా ఉంది. ఏ క్షణంలో ఏమౌతుందో తెలియదు. కారులో డ్రైవర్‌తో పాటు పక్కనే కూర్చొన్న ప్యాసింజర్ కూడా గాఢ నిద్రలో ఉంది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. మసాచుసెట్స్ కు చెందిన డకోటా ర్యాండెల్ అనే వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. నిజానికి అది టెస్లా కారు. ఇందులో సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ ఉంది. 

ఆటోపైలట్ మోడ్ లో పెట్టి.. లొకేషన్ సెట్ చేస్తే చాలు.. అదే సెల్ఫ్ డ్రైవ్ చేస్తూ లొకేషన్ చేరుకుంటుంది. అతి వేగంతో దూసుకెళ్తున్న టెస్లా కారును చూసిన ర్యాండెల్ వీడియో తీశాడు. ఆ కారు వెంటే తాను వెహికల్ తో వెళ్లాడు. అతడి కారు గంటకు 90-95 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తోంది.

ఒకవైపు తన కారు డ్రైవ్ చేస్తూనే.. మరోవైపు కారులో స్టీరింగ్ పై నిద్రిస్తున్న డ్రైవర్ ను లేపేందుకు ర్యాండెల్ ప్రయత్నించాడు. అయినా నిద్రపోతున్న డ్రైవర్ లేవలేదని ఎన్బీసీ న్యూస్ కు తెలిపాడు. ఆ వీడియోను తన ట్వి్ట్టర్ అకౌంట్లో షేర్ చేశాడు. కొద్ది గంటల్లోనే 6 లక్షల వ్యూస్ రాగా.. వేలాది షాకింగ్ కామెంట్లు వచ్చాయి. 

man
Asleep
Wheel
Self-Driving
Tesla Speed
Dakota Randall

మరిన్ని వార్తలు