న్యూడ్ ఫొటోస్ పంపమంటూ చిన్మయికి మెసేజ్

Submitted on 21 May 2019
Man asks Chinmayi for nude pictures. Singer gives epic reply

దక్షిణాదిలో పెద్దగా పరిచయం అక్కర్లేని గాయిని చిన్మయి.. సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వేధింపుల ఆరోపణలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే చిన్మయి సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. అయితే ఇటీవల ఓ వ్యక్తి ‘మీ నగ్నచిత్రాలు పంపండి’ అంటూ వెకిలి మెసేజ్‌లు చేసి చిన్మయికి చిరాకు పుట్టించాడు.

అయితే మీటూ ఉద్యమంలో ప్రముఖుల జాతకాల గురించి బయటపెట్టిన చిన్మయి.. ఆ యువకుడు చేసిన ఈ అసభ్యకర మెసేజ్‌లను వదలలేదు. ‘ఇవిగో ఇవే నా ఫేవరెట్‌ న్యూడ్స్‌’ అంటూ లిప్‌స్టిక్‌ ఫొటోలను అతడికి పంపించి చెంప చెళ్లుమనిపించేలా తెలివిగా సమాధానం ఇచ్చారు. ఆ సంభాషణకు సంబంధించిన స్క్రీన్ షాట్ తీసిన ఆమె.. ‘ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం’  అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

హ్యూమన్‌ స్కిన్‌ టోన్స్‌కు మ్యాచ్‌ అయ్యే కలర్‌లో ఉండే లిప్‌స్టిక్‌లను న్యూడ్‌ లిప్‌స్టిక్స్‌ అంటారు. ఇందులో 20 నుంచి 30 వరకు షేడ్లు ఉంటాయి. వాటిని పంపి చిన్మయి చాలా తెలవిగా వ్యవహరించారు.

Chinmayi
nude pictures
Singe
epic reply
Lipsticks

మరిన్ని వార్తలు