మజిలీ తమిళ్ రైట్స్ సొంతం చేసుకున్న ధనుష్

Submitted on 19 April 2019
MAJILI Movie Remake Rights Bought by Dhanush-10TV

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా, నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ డైరెక్షన్‌లో, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై, సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన మజిలీ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి, పాజిటివ్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. చైతు నటనకి, దర్శకుడి టేకింగ్‌కి మంచి ప్రశంసలు అందుతున్నాయి. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన మజిలీకి అన్ని క్లాసుల ప్రేక్షకులనుండి, అన్ని ఏరియాలనుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.. ఇదిలా ఉంటే ఇప్పుడు మజిలీ చిత్రం తమిళ్‌లో రీమేక్ కానుంది.

రీసెంట్‌గా మజిలీ మూవీచూసిన తమిళ స్టార్ హీరో ధనుష్, ఈ సినిమాని తమిళనాట రీమేక్ చెయ్యాలని ఫిక్స్ అవడమే కాక, తెలుగు నిర్మాతలనుండి రీమేక్ రైట్స్ కొన్నాడట. తన వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ధనుష్ మజిలీ రీమేక్‌ని ప్రొడ్యూస్ చెయ్యబోతున్నాడు. అయితే హీరోగా తనే నటిస్తాడా లేక, వేరే హీరోని ఎవరినైనా తీసుకుంటాడా అనేది తెలియలేదు. ధనుష్ ప్రస్తుతం అసురన్ అనే సినిమా చేస్తున్నాడు.

వాచ్ మజిలీ ట్రైలర్..

Naga Chaitanya
Samantha
Divyansha Kaushik
Gopi Sundar
Sahu Garapati
Harish Peddi
Shiva Nirvana

మరిన్ని వార్తలు