మూడ్ లేదు... అయినా పడకగదిలో పార్టనర్ కోర్కెను ఎందుకు తీరుస్తారు? 

Submitted on 24 February 2020
Maintenance romance Is so Important in Happy Marriages...Why  ?

ప్రతి వైవాహిక జీవితంలో శృంగారం ఎంతగా ఎక్కువగా ఉంటే అంతలా బంధం గట్టిపడుతుందని అందరూ అనుకొంటాం. అది నిజంకూడా. అదే  10 ఏళ్లు, 20 ఏళ్ల తర్వాత ఆ ఎగ్జైట్మెంట్ తగ్గుతుంది.  శృంగార వాంఛకూడా అంతే.

“ఒకరిమీద మరొకరి సెక్సువల్ ఫీలింగ్స్ ఉంటే అనుబంధంకూడా అంతే బలంగా ఉంటుంది. కాకపోతే ఏళ్లుగడిచే కొద్దీ మొదటిది తగ్గిపోతోంది” అని అంటారు సెక్సువల్ థెరిపిస్ట్ లు. మనం పార్టనర్ కోసం సమయం, ఆసక్తి చూపించనిదే సెక్స్ చేయాలన్న ఉత్సాహం రాదన్నది సైకాలజిస్ట్టిల మాట. అంటే కావాలనుకొంటే తప్ప రొమాన్స్ అన్నది దొరకదు. మరి తగ్గిపోతున్న సెక్స్ లైఫ్ కు పరిష్కారం ఏంటి? అదే.. maintenance sex

ఏంటి ఈ మెయింటినెన్స్ సెక్స్ ?
పార్టనర్స్ లో ఒక్కరికి ఇష్టం లేకపోయినా మరొకరి కోసం పడకగది సుఖాన్ని అందివ్వడాన్నే maintenance sex అంటున్నారు. అంటే ఒకరికి మూడ్ లేదు. ఒకరికి ఈరోజు మూడ్ ఉంటే మరొకరికి ఉండదు. ఇలా రోజుల గడిచిపోతే ఎలా? అందుకే వారానికి ఇన్ని రోజులు సెక్స్ అని షెడ్యూల్ వేసుకొంటారు. అంటే వారానికి రెండుసార్లు. ఆరోజు ఒకరికి మూడ్, ఇష్టం లేకపోయినా పార్టనర్ తో కలవాల్సిందే. ఇంకో అప్షన్ లేదు.

అలాగని ఇష్టంలేకపోయినా పార్టనర్ కోసం మనసును చంపుకోవడం మాత్రంకాదు. రెగ్యులర్ లైఫ్ నుంచి రొమాన్స్ మిస్ కాకుండా ఇద్దరూ చూసుకోవడమే ఈ టెక్నిక్. అంటే ఒకరు కోరుకొంటే మరికొరు కాదనకపోవడం. ఇది భారతదేశ దాంపత్య రహస్యమని సెక్సాలజిస్ట్ లు అంటారు. అదే విదేశాల్లో ఒకరికి కాదంటే మరొకరు ఫోర్స్ చేయరు. అందుకే అక్కడ సెక్స్ అన్నది తక్కువైపోతోందని తాజా సర్వేల సారాంశం.

రెగ్యులర్ సెక్స్ , ఈ మెయింటినెన్స్ సెక్స్ ఏంటీ తేడా?
Trent Universityలో సైకాలజీ ప్రొఫెసర్, Canadian Journal of Human Sexuality ఎడిటర్ Terry Humphreys, ప్రకారం అంగీకారమే అసలు తేడా. అంటే వారానికి ఇన్నిసార్లు కావాలని ముందుగానే షెడ్యూల్ వేసుకొంటే దానికి కట్టుబడం, నిర్ణయం తీసుకోవడం.  అదే రెగ్యులర్ సెక్స్ అంటే emotional experience. కోరిక ఉన్పప్పుడే శృంగారాన్ని కోరుకొంటారు.  నిజానికి రెండింటికి మధ్య కొన్నిసార్లు తేడా చెరిగిపోతుంది. సెక్స్ కు మనం ఓకేనా? లేదంటే ఈరోజు శృంగారాన్ని ఒప్పుకోవాల్సిందేనని మానసికంగా సిద్ధపడటం. రోజువారీ శృంగారంలో  కోరిక పాత్ర ఎక్కువగా ఉంటుంది. maintenance sexలో ఇద్దరూ ఒప్పుకోవాల్సిందే.

ఎందుకు మెయింటినెన్స్ సెక్స్ కావాలి?  
పార్టనర్ కోరినప్పుడు పెద్దగా ఉత్సాహం లేకపోయినా మంచమెక్కడానికి చాలా కారణాలంటాయని సైకాలజిస్ట్ లంటారు.  పెద్ద కారణం ఒకరిమీద మరొకరు ఆధారపడటం. దాంపత్య జీవితంలో ఇది తప్పనిసరి ఎర్పాటు. మరీ ముఖ్యంగా ఇండియాలో. ఉదాహరణకు పార్టనర్ అంటే ఇష్టం, గౌరవం ఉంటుంది. వాళ్లకు రొమాన్స్ కావాలన్నప్పుడు ఎందుకు నో చెప్పాలి? నెమ్మదిగా ఆ మూడ్ లోకి వెళ్లిపోతే బెటర్ కదా! దాంపత్య జీవితంలో గొడవలు, ఎడబాట్లు తప్పించుకోవడానికి పార్టనర్ ఇదో కాంప్రమైజ్  టెక్నిక్ అంట. ఈరోజు ఇష్టాఇష్టాలను పక్కనపెడితే వాచ్చేవారం నాకు వేరే అవసరమున్నప్పుడు తాను అంగీకరిస్తాడు.

scheduled sexతో లాభాలేంటి?
మొదట్లో ఈ టెక్నిక్ unromantic అనిపిస్తుంది. లైఫ్ పార్టనర్ ఇద్దరూ సరిగా వాడాలేకాని మెయింటినెన్స్ సెక్స్ దాంపత్యజీవితాన్ని గట్టిపరుస్తుందని సైక్సాలజిస్ట్ అంటారు. రొమాన్స్ కరువైపోతున్న ఈకాలంలో కనీసం కొంతమోతాదులోనైనా సెక్స్ చాలా అవసరమేకదా! నిజానికి వారానికి ఎంత రొమాన్స్ కావాలో సైన్స్ కూడా పూర్తిగా తెలియదు. కాకపోతే ప్రతివారంలో అసలు లేకపోవడం కన్నా, షెడ్యూల్డ్ రొమాన్స్ చాలా బెటరని రీసెర్చ్ చెబుతోంది. 

జీవితం రొమాంటిక్ గా ఉండాలంటే ముందు ఒకరిమాటను మరొకరు వినాలి. షెడ్యూల్డ్ సెక్స్ కదాని ఈరోజు తప్పనిసరి అంటే మాత్రం అసలుకే మోసమొస్తుంది. ఏ టెక్నిక్ లోనైనా అంగీకారం మాత్రం తప్పనిసరి.  

maintenance
Sex
schedule sex
partner
bed room
romance

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు