సింగ‌పూర్‌ నుంచి హైద‌రాబాద్‌కి రానున్న మ‌హేష్ మైన‌పు విగ్ర‌హం

Submitted on 22 March 2019
Mahesh Wax Statue Comes To Hyderabad On March 25

మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో మహేష్ మైనపు విగ్రహం ఏర్పాటుచేసిన సంగతి మనందరికి తెలిసిన విషయమే. దక్షిణాది హీరోల్లో ప్రభాస్ తర్వాత ఆ ఘనత సాధించింది మన సూపర్‌స్టారే. అయితే ఎక్కడో సింగపూర్‌ మ్యూజియంలో మహేష్ విగ్రహం పెడితే.. ఇక్కడ నుండి వెళ్లి ఆ విగ్రహాన్ని చూడటం అంటే అందరికీ వీలుకాదు..అయితే ఈ సమస్యను మహేష్ తీర్చబోతున్నారు. మరో మూడురోజుల్లో (మార్చి 25,2019) న ఈ విగ్రహాన్ని మన హైదరాబాద్ తీసుకురానున్నారు. 
Read Also : సెల్ఫీ ప్లీజ్ : వామ్మో.. ఎయిర్ పోర్ట్ లో షార్క్.. ప్రయాణీకులు షాక్

హైదరాబాద్ గచ్చీబౌలిలో మహేష్ బాబుకు చెందిన AMB సినిమాస్ లో దాన్ని కొద్దిరోజులు పాటు ఉంచబోతున్నారు. అభిమానులు వచ్చి సూపర్ స్టార్ విగ్రహంతో ఫొటో దిగచ్చు. తరువాత సింగపూర్ తరలించి అక్కడి టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంచనున్నారు. ఇందులో మ‌హేష్ హెయిర్ స్టైల్ స‌రికొత్త‌గా ఉండగా, ఇది అభిమానుల‌ని ఆకట్టుకుంది. 

ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే.. అయన త‌న 25వ చిత్రాన్ని వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నారు. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 25న రిలీజ్ చేయనున్నట్టు చిత్రం టీమ్ అధికారికంగా ప్రకటించింది. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరో అల్లరి నరేష్‌ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
Read Also : హలో ఈసీ : హెల్ప్ లైన్ 1950 స్పెషల్ అదే

Mahesh Wax Statue
Singapore To Hyderabad
March 25
2019

మరిన్ని వార్తలు