బుక్ అయ్యారు : మహేష్ బాబుకి GST నోటీసులు

Submitted on 20 February 2019
Mahesh Babu’s AMB Booked for GST fraud-10TV

ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి బుక్ అయ్యారు. కొన్నాళ్ల క్రితం ఇన్ కం ట్యాక్స్ అధికారులు బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ ఘటన మర్చిపోకముందే.. ఇప్పుడు GST అధికారులు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. దీనిపై సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తోంది. ఇంతకీ GST అధికారులు ఎందుకు నోటీసులు ఇచ్చారు అనేది చూద్దాం..

ఇటీవలే మహేష్ బాబు మల్టీఫ్లెక్స్ బిజినెస్ లోకి దిగారు. AMB పేరుతో గచ్చిబౌలిలో ఏడు స్క్రీన్లతో, అత్యాధునిక సౌకర్యాలతో సూపర్బ్ మల్టీప్లెక్స్ నిర్మించారు. జనవరిలో AMB సినిమాస్ కూడా ప్రారంభం అయ్యాయి. సినిమా టికెట్ రేట్ల విషయంలో అసలు రాద్దాంతం జరిగింది. జనవరి ఒకటో తేదీ నుంచి సినిమా ధియేటర్లలో కొత్త GST నిబంధనలు అమల్లోకి వచ్చాయి. రూ.100పైన ఉన్న టికెట్ ధరపై 28శాతం GSTని 18శాతానికి తగ్గించింది ప్రభుత్వం. అదే విధంగా 100 రూపాయలలోపు టికెట్ ధరపై GSTని 18 నుంచి 12శాతం స్లాబ్ లోకి తీసుకొచ్చింది. అయితే మహేష్ బాబు మల్టీఫ్లెక్స్ అయిన AMB మాత్రం తగ్గించిన జీఎస్టీ ధరలను అమలు చేయలేదు. ప్రేక్షకుల నుంచి జీఎస్టీ అదనంగా వసూలు చేసింది. ఈ విధంగా 30 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు నోటీసులు ఇచ్చారు. కేసు నమోదు చేశారు.


ఇప్పటికే మహేష్ బాబుపై 2007-08 ఏడాదికి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహారంలో లావాదేవీలకు సంబంధించిన సర్వీస్ ట్యాక్స్ వ్యవహారం పెండింగ్ లో ఉంది.

Mahesh Babu
AMB Cinemas
GST fraud

మరిన్ని వార్తలు