హ్యాపీ బర్త్‌డే సుకుమార్ - మహేష్‌తో సినిమా ఫిక్స్

Submitted on 11 January 2019
Mahesh Babu next Movie with Sukumar-10TV

తను తీసే సినిమాలు ఆడియన్స్‌కి పజిల్స్‌లా అనిపిస్తాయి. అసలు ఆయనకిలాంటి ఐడియాలు ఎలా వస్తాయబ్బా అని అందరూ జుట్టు పీక్కుంటుంటారు. సినిమా సినిమాకీ తనస్థాయినీ, ఆడియన్స్ అంచనాలనీ పెంచుకుంటూ వెళ్తున్నాడు, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. జనవరి 11న ఆయన పుట్టినరోజు. రంగస్థలంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గుర్తుండిపోయే సినిమాని అందించిన సుకుమార్, తన తర్వాతి సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చెయ్యబోతున్నాడు. ఈ విషయాన్ని మైత్రిమూవీ మేకర్స్ వారు అఫీషియల్‌గా అనౌన్స్ చేసారు. డైరెక్టర్ సుకుమార్ బర్త్‌‌డే సందర్భంగా నిర్మాతలు పేపర్ యాడ్స్ ఇచ్చారు.

సుకుమార్, మహేష్ బాబు కాంబినేషన్‌లో ఇంతకుముందు వచ్చిన, 1 నేనొక్కడినే విమర్శకుల ప్రశంసలందుకున్నా, ఆడియన్స్‌ని మెప్పించలేక పోయింది. ప్రేక్షకులు థియేటర్లలో కంటే, టీవీల్లోనే ఎక్కువగా చూసారు. ఈ సారి ఒక డిఫరెంట్ స్టోరీతో మహేష్‌ని సరికొత్తగా ప్రెజెంట్ చెయ్యబోతున్నాడట సుకుమార్. ప్రస్తుతం వంశీ పైడిపల్లితో చేస్తున్న మహర్షి తర్వాత, మహేష్, సుకుమార్ సినిమా స్టార్ట్ అవుతుంది. 

Mahesh Babu
Sukumar
Mahesh Babu next Movie with Sukumar

మరిన్ని వార్తలు