సాధ్వికి బిగ్ షాక్!

Submitted on 21 May 2019
Madhya Pradesh To Reopen 2007 Murder Case In Which Pragya Thakur Was Cleared

భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వి ప్రగ్యాసింగ్‌ ఠాకూర్‌ కు షాకిచ్చేందుకు కమల్ నాథ్ సర్కార్ రెడీ అవుతోంది. ప్రగ్యాసింగ్‌ నిందితురాలిగా ఉన్న ఆరెస్సెస్‌ ప్రచారక్‌ హత్యకేసును రీఓపెన్‌ చేసేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 2007లోసునీల్‌ జోషి అనే ఆరెస్సెస్‌ ప్రచారక్‌ దారుణ హత్యకు గురయ్యారు. కాంగ్రెస్‌ నాయకుడి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్‌ జోషి.. అరెస్టు నుంచి తప్పించుకునే క్రమంలో దుండగులు ఆయనను కాల్చి చంపారు. ప్రగ్యా సింగ్‌ సహా మరో ఏడుగురికి ఈ హత్యతో సంబంధం ఉన్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు లభించని కారణంగా 2017లో కోర్టు వీరిని నిర్దోషులుగా తేల్చింది. ప్రస్థుత పరిణామాల సందర్భంగా ఈ కేసును తిరగదోడాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం యోచిస్తోంది. 

ఈ విషయం గురించి రాష్ట్ర న్యాయశాఖా మంత్రి పీసీ శర్మ మాట్లాడుతూ.. సునీల్‌ జోషి హత్య కేసును తిరిగి ఓపెన్‌ చేసేందుకు న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కేసు తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. ఈ కేసులో దేవాస్‌ కలెక్టర్‌ తన సొంత నిర్ణయాల మేరకు కేసును మూసి వేశారని, ఉన్నత న్యాయస్థానానికి వెళ్లకుండా అడ్డుపడ్డారని ఆరోపించారు. ఈ కేసు ఫైల్‌ ను సమర్పించాల్సిందిగా కలెక్టర్‌ ను ఆదేశించామని తెలిపారు. సునీల్‌ జోషి హత్యకేసు తిరగదోడటంపై బీజేపీ అధికార ప్రతినిధి రజనీశ్‌ అగర్వాల్‌ స్పందించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం దిగ్విజయ్‌ సింగ్‌పై ప్రగ్యా పోటీ చేసినందుకు ఆమెపై ప్రతీకారం తీర్చుకుంటున్నారని విమర్శించారు.

madhyapradesh
sadvi pragya singh
murder case
re open
SUNIL JOSHI
RSS
murder
BJP
revenge

మరిన్ని వార్తలు