మధుర రాజా-వస్తున్నాడు

Submitted on 16 February 2019
Madhura Raja Grand Release on April 12th-10TV

మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, వైఎస్సార్ బయోపిక్ యాత్ర సినిమాతో చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యాత్రలో మమ్ముట్టి నటనకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం మలయాళంలో మధుర రాజా అనే సినిమా చేస్తున్నాడు మమ్ముట్టి. మన్యంపులి ఫేమ్ విశాఖ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ట్వంటీ, పోకిరి రాజా సినిమాల తర్వాత మమ్ముట్టి, విశాఖ్‌ల కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా మధుర రాజా నే.. దాదాపు రూ. 23 కోట్ల భారీ బడ్జెట్‌తో నెల్సన్ నిర్మిస్తున్న ఈ మూవీలో, జగపతి బాబు విలన్‌గా నటిస్తుండగా.. తమిళ యువ నటుడు జై ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు.. సన్నీ లియోన్ స్పెషల్ సాంగ్ చేస్తుంది.

పృథ్వీరాజ్, అశిష్ విద్యార్థి, అతుల్ కులకర్ణి, అజూ వర్గీస్ తదితరులు నటిస్తున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న మధుర రాజా చిత్రాన్ని, ఏప్రిల్ 12 న గ్రాండ్‌గా రిలీజ్ చెయ్యనున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించింది.. ఈ సినిమాకి రచన : ఉదయ్ కృష్ణ, సంగీతం : గోపీ సుందర్, కెమెరా : షాజీ కుమార్, ఎడిటింగ్ : మహేష్ నారాయణ్, సునీల్ ఎస్.పిళ్ళై, ఫైట్స్ : పీటర్ హెయిన్. 

Mammootty
Jagapathi Babu
Gopi Sunder
Nelson Ipe
Vysakh

మరిన్ని వార్తలు