మా కొత్త అధ్యక్షుడిగా 'నరేష్' ప్రమాణ స్వీకారం

Submitted on 22 March 2019
MAA New President 'Naresh' Sworn In

టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. సీనియర్ నటుడు నరేష్ కొత్త అధ్యక్షుడిగా, హీరో రాజశేఖర్ ఉపాధ్యక్షుడిగా, జీవిత ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ‘మా’ అధ్యక్షుడిగా ప్రముఖ నటుడు నరేష్ ఈ రోజు (మార్చి 22, 2019)న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విషయంలో గతకొంతకాలంగా కొత్త అధ్యక్షుడు నరేష్ కు, ‘మా’ మాజీ అధ్యక్షుడు, శివాజీరాజాకు అభిప్రాయ భేదాలు, వివాదాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. కాగా.. ఈరోజు ప్రమాణస్వీకారానికి శివాజీరాజా కూడా హాజరుకావడం గమనార్హం. 

* ఈ సందర్భంగా శివాజీరాజా మాట్లాడుతూ.. 
‘మా’ కమిటీ భవిష్యత్తులో అద్భుతాలు చేయాలని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని, ఎప్పటిలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. నాకంటే ముందు అధ్యక్షులుగా పనిచేసిన వారు చెప్పిందేంటంటే.. ‘మేం ఎక్కడెక్కడి నుంచో కష్టపడి ఫండ్స్‌ తీసుకొచ్చిపెట్టాం. దాంట్లోంచి పైసా కూడా కదపకుండా చూసుకున్నాం. మీరు కూడా కష్టపడి ఫండ్స్ కలెక్ట్‌ చేసి తీసుకురావాలి.. అని చెప్పారు. అలాగే తప్పకుండా వారి మాటను నేను పాటించాను. అదే విధంగా ఇప్పుడు పనిచేయబోయే కమిటీ కూడా అంతే కష్టపడాలని ఆశిస్తున్నాను. నా నుంచి ఏ సాయం కావాలన్నా నేను చేయడానికి సిద్ధమే’ అన్నారు. ‘మా’ కోసం ఓ ప్రత్యేక గీతాన్ని కమిటీ రూపొందించినట్లు ఈ సందర్భంగా నరేష్ వెల్లడించారు. ఈ పాటను సూపర్‌స్టార్‌ కృష్ణ దంపతులు, కృష్ణంరాజు దంపతుల చేతుల మీదుగా విడుదల చేశారు.
Read Also : మరోసారి హార్రర్ చిత్రంలో మిల్కీబ్యూటీ!

MAA New President
Hero Naresh
sworn in
2019

మరిన్ని వార్తలు