Low Fat డైట్‌పై మోజు పెరిగిందా? లైంగిక సామర్థ్యం తగ్గినట్టే!

Submitted on 16 January 2020
Low-fat diet associated with reduction in testosterone among men

ప్రస్తుత జీవనశైలిలో డైటింగ్ అనేది చాలామంది ఫాలో అవుతున్నారు. అధిక బరువును త్వరగా తగ్గించుకోవాలని తెగ డైటింగ్ చేస్తుంటారు. కొందరు నిపుణుల సలహాతో డైటింగ్ చేస్తుంటే మరికొందరు ఎవరో చెప్పారని డైట్ చేస్తుంటారు. ఏ డైట్ చేయాలి? ఏది చేయకూడదనే విషయంలో చాలామందికి అవగాహన ఉండదు. ప్రత్యేకించి లో ఫ్యాట్ డైట్ చేసేవారిలో ప్రయోజనాల కంటే దాని తాలూకూ దుష్ర్ఫభావాలు ఎక్కువగా ఉంటాయి. పురుషుల విషయానికి వస్తే.. చాలామంది మగాళ్లలో టెస్టోస్టిరాన్ లోపం అధికంగా కనిపిస్తోంది.

ఈ సమస్యను అధిగమించడానికి పురుషులు ఎక్కువగా బరువు తగ్గేందుకు డైటింగ్ చేస్తుంటారు. బరువు తగ్గడం ద్వారా టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయి పెరిగేందుకు సాయపడుతుంది. కానీ, నిర్దిష్టమైన కొన్ని డైటింగ్స్.. అంటే.. Low Fat Diet ద్వారా కొద్దిమొత్తంలో ప్రయోజనం కనిపించినప్పటికీ దీని కారణంగా టెస్టోస్టిరాన్ పెరిగాల్సింది పోయి అంతే వేగంగా తగ్గుతుందని ఓ అధ్యయనం హెచ్చరిస్తోంది. అమెరికన్ యూరాలాజికల్ అసోసియేషన్ (AUA) అధికారిక జనరల్ ‘ది జనరల్ ఆఫ్ యూరాలజీ’లోని అధ్యయనం సూచిస్తోంది. దీన్ని లిప్పిన్ కట్ పొర్ట్ ఫోలియోలో వోల్టర్స్ క్లుయేర్ పబ్లీషింగ్ కంపెనీ ఈ అధ్యయనాన్ని ప్రచురించింది.

సాధారణంగా టెస్టోస్టిరాన్ అనేది పురుషుల్లో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మగవారి లైంగిక సామర్థ్యాన్ని పెంచే సెక్సువల్ హార్మోన్ ఇది. దీని కారణంగా వీర్య కణాలు (శుక్ర కణాలు) ఉత్పత్తి పెరుగుతుంది. అయితే, ఈ అధ్యయనంలో నియయాలు లేని డైటింగ్ చేసేవారి కంటే కఠిన నియమాలు కలిగిన Low Fat Diet పాటించే చాలామంది పురుషుల్లో సీరమ్ టెస్టోస్టిరాన్ చాలా తక్కువగా ఉన్నట్టు రిపోర్టు తెలిపింది.

నార్త్ వెస్టరన్ యూనివర్శిటీ ఫెయిన్ బెర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసన్ అండ్ ది డిపార్ట్ మెంట్ ఆఫ్ సర్జరీ, నార్త్ షోర్ యూనివర్శిటీ హెల్త్ సిస్టమ్ కు చెందిన డిపార్ట్ మెంట్ ఆఫ్ సర్జరీ, యూనివర్శిటీ ఆఫ్ చికాగో మెడిసిన్ అండ్ కొలిగ్స్, యూరాలాజీ విభాగ ఎండీ, జాక్ ఫాంటస్ పరిశోధక బృందం ఈ నివేదికను వెల్లడించింది. అంతేకాదు.. అన్ని డైట్లతో పోలిస్తే సీరమ్ T లో చిన్నపాటి వ్యత్యాసాలు ఉన్నట్టు గుర్తించినట్టు పరిశోధకులు గుర్తించారు.

టెస్టోస్టిరాన్ లోపానికి బెస్ట్ డైట్ ఉందా? :
పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచే టెస్టో స్టిరాన్ హార్మోన్ లోపానికి నివారించే మంచి డైట్ ఏదైనా ఉందా అంటే ప్రస్తుతానికి ఏ డైట్ లేదనే చెప్పాలి. వైద్యులు ఫాంటస్ ఆధ్వర్యంలోని పరిశోధక బృందం దేశవ్యాప్తంగా నిర్వహించిన హెల్త్ స్టడీ ( ది నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రీషియన్ ఎగ్జామినేషన్ సర్వే లేదా NHANES)లో భాగంగా 3వేల 100కి పైగా పురుషుల డేటాను విశ్లేషించింది. ఈ సర్వేలో పాల్గొన్న పురుషులందరి డైట్, సీరమ్ టెస్టోస్టిరాన్ స్థాయికి సంబంధించిన డేటాను పరిశోధక బృందం పరిశీలించింది.

డైట్ హిస్టరీ కారణంగానే హార్మోన్ లోపం  :
రెండు రోజుల డైట్ హిస్టరీ ఆధారంగా 14.6 శాతం పురుషుల్లో ఎక్కువగా Low Fat Diet కారణంగానే ఈ సెక్సువల్ హార్మోన్ తగ్గినట్టు గుర్తించారు. మిగతా 24.4 శాతం పురుషుల్లో మెడిటరేనియన్ డైట్ (మధ్యదరా ఆహారం)లో భాగంగా అధికంగా పండ్లు, కూరగాయాలు, పప్పుదినుషులతో పాటు తక్కువ మోతాదులో మాంసకృత్తులు, పాల ఉత్పత్తులను తీసుకున్నారు. వీరిలో కొంతమంది మాత్రమే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) నిర్దేశించిన (లో- కార్బోహైడ్రేట్ డైట్) ప్రమాణాలకు చేరుకున్నారు. అందుకే ఈ గ్రూపువారిని తమ విశ్లేషణ విభాగం నుంచి మినహాయించారు. 

ఈ అధ్యయనంలో సీరమ్ టెస్టోస్టిరాన్ స్థాయి సగటున 435.5 ng/dl (నానోగ్రామ్స్ పర్ డిసిల్లీటర్) ఉన్నట్టు గుర్తించారు. నియమాలతో కూడిన రెండు రకాల డైటింగ్ చేసిన పురుషుల్లో సీరమ్ టెస్టోస్టిరాన్ స్థాయి తక్కువగా ఉన్నట్టు గుర్తించగా, Low Fat diet తీసుకున్నవారిలో సగటున 411 ng/dl గా ఉండగా, మెడిటరేనియన్ డైట్ చేసిన వారిలో 413 ng/dl గా ఉన్నట్టు గుర్తించామన్నారు.

ఆ తర్వాత టెస్టోస్టిరాన్ పై ప్రభావాన్ని కలిగించే కొన్ని అంశాల్లో వయస్సు, బాడీ మాస్ ఇండెక్స్ (BMI), ఫిజికల్ యాక్టివిటీ, మెడికల్ కండీషన్స్ ఇలా అన్నింటిపై కూడా పరీక్షించారు. ఇందులో లో ఫ్యాట్ డైట్ పాటించిన పురుషుల్లో సీరమ్ టెస్టోస్టిరాన్ స్థాయి తగ్గినప్పటికీ మెడిటరేనియన్ డైట్ (మధ్యదరా ఆహారం) లో మాత్రం మార్పు కనిపించలేదు. మొత్తం మీద 26.8 శాతం పురుషుల్లో టెస్టోస్టిరాన్ స్థాయి 300 ng/dl కంటే చాలా తక్కువగా ఉన్నట్టు అధ్యయనంలో తేలింది.

ఏడాదికి 5 లక్షల పురుషుల్లో లోపం :
అమెరికాలో ప్రతి ఏడాదిలో టెస్టోస్టిరాన్ లోపం ఉన్నవారు అధిక స్థాయిలో పెరిగిపోతుండగా, వారిలో 5లక్షల మంది పురుషుల్లో టెస్టోస్టిరాన్ లోపం ఉన్నట్టు గుర్తించారు. టెస్టోస్టిరాన్ లోపం కారణంగా ఎన్నో సమస్యలకు కారణంగా మారుతుంది. శక్తిని కోల్పోతారు. లైంగిక వాంఛ కోల్పోతారు. మానసిక రుగ్మతలకు దారి తీస్తుంది. శరీరంలోని కొవ్వు శాతం పెరిగిపోతుంది.

ఎముకల్లో లవణల స్థాయి కొరత ఏర్పడే అవకాశం ఉంది. టెస్టోస్టిరాన్ లోపాన్ని నివారించేందుకు పురుషులందరూ తప్పనిసరిగా తమ జీవైన శైలిలో ధ్యానం చేయడం, వ్యాయమాలు, బరువు తగ్గడం ద్వారా లోపాన్ని తగ్గించుకోవచ్చు. కానీ, డైటింగ్ చేయడం ద్వారా టెస్టోస్టిరాన్ స్థాయిలపై ప్రభావం పడుతుందనడంలో స్పష్టత లేదు.

Low-fat diet
reduction
testosterone
Men
AUA

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు