ప్రేమించమన్నాడు : తాజ్ మహల్ తో తల పగలగొట్టాడు 

Submitted on 18 January 2019
Love harassment in Delhi: Attack with the Taj Mahal

ఢిల్లీ : ప్రేమించమన్నాడు..వెంటపడ్డాడు..తాజ్ మహల్ బొమ్మతో ప్రపోజ్ చేశాడు. జైలుపాలయ్యాడు. ప్రేమకు చిహ్నం తాజ్ మహల్ ను ప్రేయసికి కానుకగా ఇచ్చి తన ప్రేమను అంగీకరించమని వేడుకున్నాడు. వెంటపడ్డాడు..కానీ ఆమె మాత్రం ఇష్టపడలేదు. ఢిల్లీలో జీతు అనే యువకుడు.. ఓ యువతి వెంటపడుతూ, ప్రేమించాలని వేధిస్తున్నాడు. తన వద్ద ఉన్న తాజ్ మహల్ బొమ్మను తీసుకుని ఆమె ఇంటి వద్దకు వచ్చాడు. తాజ్ మహల్ తీసుకుని ప్రేమించమనీ ఒత్తిడిచేస్తు తాజ్ మహల్ బొమ్మని ఆమె పైకి విసిరాడు. మిస్ అయి అక్కడే కూర్చుని భోజనం చేస్తున్న ఆ యువతి తండ్రి తలకు తగిలి తీవ్ర గాయం అయ్యింది. ఈ క్రమంలో యువతి అసలు విషయం చెప్పటంతో కుటుంబీకులు పోలీసులను కంప్లైంట్ చేయగా వారు కేసు  నమోదు చేసుకుని జీతును అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇలా ఆ తాజ్ మహల్ కథలో తండ్రి తల పగిలింది. ప్రేమికుడు జైలుపాలయ్యాడు.

 

Delhi
love harassment
Taj Mahal
Arrest

మరిన్ని వార్తలు