రైలు కిందపడి లవర్స్ సూసైడ్

Submitted on 16 April 2019
Love couple suicide in chittooor district

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మొరపల్లిలో విషాదం నెలకొంది. రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. రైలు పట్టాల పక్కన ఇద్దరూ విగతజీవులై పడి ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లంభించిన ఆధారాల మేరకు మృతుడు చంద్రగిరికి చెందిన ధనుంజయ్ (23)గా గుర్తించారు. జేసీబీ డ్రైవర్ గా పని చేస్తున్నారు. అమ్మాయి మైనర్ గా తెలుస్తోంది. 

ఇద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే కుటుంబాలు వీరి పెళ్లికి అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీకాళహస్తి ప్రాంతానికి చెందిన యువతిగా అనుమానిస్తున్నారు. యువతి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. 
Read Also : హైదరాబాద్ లో దారుణం : మందు పార్టీ ఇచ్చి.. యువతిపై గ్యాంగ్ రేప్

Love couple
Suicide
trian
chittooor
Police
Investigation


మరిన్ని వార్తలు