బీరు లారీ బోల్తా.. కాపలాగా పోలీసులు

Submitted on 27 May 2019
Lorry which Carrying Beer Bottles met accident at begumpet in hyderabad

హైదరాబాద్‌లోని బేగంపేటలో సోమవారం తెల్లవారుజామున బీరు కాటన్లతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. లారీ బోల్తా పడటంతో బీరు సీసాలు అన్నీ రోడ్డు మీద చెల్లాచెదురుగా పడిపోయాయి. బీరు బాటిళ్లు పడపోవడంతో వాటిని ఎత్తుకెళ్లేందుకు స్థానికులు ఎగబడ్డారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు. కాపాలాగా ఉన్నారు. ఎవర్నీ లారీ వైపు రాకుండా అడ్డుకున్నారు.

వేల సంఖ్యలో బీరు సీసాలు అలా రోడ్డుపై పడిఉండటం స్థానికులు, వాహనదారులకు ఆశ్చర్యానికి గురి చేసింది. అయ్యో బీర్లు అంటూ చర్చించుకోవటం జరిగింది. అన్నీ కూడా కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ బ్రాండ్. మందు కొట్టాలి అంటే బీరు ప్రియులకు ముందుగా గుర్తుకొచ్చేది కింగ్ ఫిషర్. అసలే సమ్మర్.. బీర్లు దొరక్క ఇబ్బంది పడుతున్న సమయంలో వేల సంఖ్యలో బీరు బాటిళ్లు.. రోడ్డుపై పడి ఉండటంతో అందరికీ ఆసక్తి కలిగించింది. పోలీసులు లేకపోతే నిమిషాల్లో ఎత్తుకెళ్లేవారు.

రోడ్డుపై లారీ బోల్తా పడటంతో భారీగా వాహనాలు ఆగిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇటీవల కర్నూలు జిల్లాలో కూడా ఇటువంటి ప్రమాదమే జరిగిన సంగతి తెలిసిందే. బీర్ల లోడుతో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగగా బీరు బాటిళ్లు టపాసుల్లా పేలిపోయాయి.

Lorry
beer bottles
Accident
begumpet
Hyderabad

మరిన్ని వార్తలు