చ‌రిత్ర‌లో కొత్త నిజాలు : ఇరాక్ లో శ్రీరాముని పాద ముద్రలు

Submitted on 26 June 2019
Lord Rama footprints on Iraq’s cliff? Indian embassy tracks mural

భారతీయ హిందువుల ఆరాధ్యదైవమైన శ్రీరాముని పాదముద్రలు ఇరాక్ లో ప్రత్యక్షమయ్యాయి. సాధారణ యుగానికి (2000BCE ) కంటే ముందు రాముని ముద్రలు ఇరాక్ కొండ శిఖరంపై చెక్కినట్టు పురావస్తు శాఖ అంచనా వేస్తోంది. అయోధ్య షౌధ్ సంస్థాన్ ప్రతిరూపాన్ని పోలినట్టు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ఏడాది జూన్ లో భారతీయ పురావస్తు శాఖ ప్రతినిధుల బృందం ఇరాక్ వెళ్లింది. అక్కడి పురాతన, ప్రాచీన కళారూపాలపై అధ్యయనం చేసేందుకు వెళ్లారు.

అక్కడి ప్రాచీన కళారూపాల్లో శ్రీరాముని పోలిన ఓ కళాత్మక ప్రతిరూపం కనిపించింది. ఇరాక్ లోని హరోన్ షేఖాన్ ప్రాంతంలో అన్వేషిస్తుండగా.. దర్భాండ్ ఈ బెల్యులా అనే ఎత్తైన కొండ శిఖరంపై రాముని ప్రతిరూపం కనిపించడం చూసి ప్రతినిధుల బృందం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. చెక్కిన శిలారూపంపై రాముడు బాణం పట్టుకుని ఉన్నాడు. భుజం వెనుక బాణాలు ఉంచే అంబులపొద కూడా ఉంది. రాముడు ధరించిన బెల్ట్ కు ఓ చిన్న కత్తి ఉంది. రాముని ప్రతిమ ముందు మరొకరి ప్రతిమ కూడా చెక్కి ఉంది. 

అచ్చం ఆంజనేయుడిలా? 
ఆ ప్రతిరూపం.. రామున్ని వేడుకుంటున్నట్టుగా ఉంది. సాధారణంగా రాముని బంటుగా హనుమతుండు కనిపిస్తాడు. అచ్చం ఆంజనేయునిలా రాముని ఎదుట పాదాలను వెనుకకు మడిచి కూర్చొని ఉన్నాడు. చూస్తుంటే.. అయోధ్య షోధ్ సంస్థాన్ లోని హనుమాన్ ప్రతిరూపాన్ని పోలి ఉన్నట్టు కనిపిస్తోంది. ఆదివాసీల పర్వతంగా పిలిచే కొండ శిఖరంపై చెక్కిన ప్రతిమలను ఇరాకీలు తర్దున్నీగా వర్ణిస్తుంటారు.

రాగిరేకుతో వేసిన అచ్చులు వంటి ఎన్నో ప్రతిమలు ఇక్కడ ఉన్నాయి. అయోధ్య షౌధ్ సంస్థాన్, యూపీ ప్రభుత్వం సూచన మేరకు ఇండియా అంబాసిడర్ ఆధ్వర్యంలో యూపీ సాంస్కృతిక శాఖకు చెందిన ప్రదీప్ సింగ్ రాజ్ పురోహిత్ తో కూడిన పురావస్తు శాఖ ప్రతినిధుల బృందం ఇరాక్ వెళ్లింది.

ఇరాక్.. లింక్ ఎలా? : పురావస్తు శాఖ అన్వేషణ 
ఈ అన్వేషణలో ఎబ్రిల్ కౌన్సిలేట్ లోని భారత దౌత్యవేత్త, చంద్రమౌళి కర్న్, యూనివర్శిటీ ఆఫ్ స్యూలైమానియా, ఇరాక్ గవర్నర్ ఆఫ్ క్యుర్డాస్టాన్ కు చెందిన చార్రితకారులు పాల్గొన్నారు. భారత సంస్కృతికి.. శ్రీరాముని చర్రితకు ఇరాక్ మెసొపొటేమియాకు సంబంధం ఏంటి? అనే కోణంలో ప్రతినిధుల బృందం అన్వేషణ సాగింది. రాముని ప్రతిరూపాన్ని ఇరాక్ లో చెక్కడానికి గల కారణాలు ఏంటి? రాముడి చరిత్ర ఇక్కడివారికి ఎలా తెలుసు? కొన్నివేల యుగాల ముందు సింధు లోయ నాగరికత చెందిన వారు ఎవరైనా భారత్ నుంచి ఇరాక్ వెళ్లారా? అనే కోణంలో అన్వేషణ కొనసాగుతోంది. 

ఎక్కడో లింక్ మిస్ అవుతుందని భావించిన పురావస్తు శాఖ అధికారుల బృందం ఇరాక్ ప్రభుత్వం అనుమతితో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు యూపీ సంస్కృతిక శాఖ.. అయోధ్యలో కూడా ఇరాక్ లోని రాముని ప్రతిరూపం మాదిరిగా ఒక ప్రతిరూపాన్ని చేయించాలనే ప్రతిపాదించింది. ప్రపంచంలోని పలు దేశాల్లో రాముని ముద్రలు అందుబాటులో ఉన్నాయని, వివిధ ప్రాంతాల్లోని అన్ని రాముని ముద్రలను తీసుకొచ్చి అయోధ్యలోకి తీసుకురావాలని ప్రతిపాదించినట్టు అధికారులు తెలిపారు.   

Indian Embassy
mural
lord rama
Iraq’s cliff
Imprints
Darband-i-Belula cliff
Ayodhya Shodh Sansthan 


మరిన్ని వార్తలు