ఆధార్‌’ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Submitted on 5 January 2019
aadhar amandament

న్యూఢిల్లీ:  మొబైల్ కనెక్షన్ తీసుకోవాలన్నా, బ్యాంకు ఖాతా తెరవాలన్నా ఇక నుంచి ఆధార్  ఇవ్వక్కర్లేదు.  ఆధార్ చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ శుక్రవారం ఆమోదం తెలిపింది. దీనితో పాటు మరో 2  అనుబంధ చట్టాల నవరణ బిల్లులను కూడా లోక్ సభ ఆమోదించింది. మొబైల్, బ్యాంకు సేవలకు ఆధార్‌ తప్పనిసరి కాదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా చట్టంలో ఈ సవరణ చేశారు. ఇక నుంచి బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, మొబైల్‌ కనెక్షన్‌ పొందేందుకు పౌరులు ఆధార్‌ వివరాలు సమర్పించాల్సిన అవసరం లేదు.  ఆధార్‌తో పాటు టెలిగ్రాఫ్, మనీ ల్యాండరింగ్‌ నిరోధక చట్టాల్లో సవరణలు చేశారు. 
లోక్ సభ ఆమోదించిన  సవరణ చట్టం ప్రకారం 18 ఏళ్లు నిండిన తరువాత ఆధార్‌ను రద్దుచేసుకునేందుకు మైనర్లకు అవకాశం కల్పించారు. ఆధార్‌ వినియోగంలో నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తారు.ఆధార్‌ లేని కారణంగా బ్యాంక్ ఖాతాల ప్రారంభం, మొబైల్ సేవలను నిరాకరించటం చేయరాదు. వినియోగదారుల ఫోటో ఐడీ కోసం మొబైల్ కంపెనీలు ఆధార్ తో పాటు పాస్ పోర్టు లేదా కేంద్రం జారీ చేసిన ఇతర పత్రాల్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. పౌరుల ఆధార్ వివరాలను, బయోమెట్రిక్ వివరాలను సర్వీసు ప్రొవైడర్లు భద్రపరచరాదని చట్టంలో  పేర్కోన్నారు.

bank account
mobile connections
Lok Sabha
approval
Aadhaar
amendment
Parlament
sessions

మరిన్ని వార్తలు