మూడు ఫుల్లులు, ఆరు బీర్లు : తూర్పుగోదావరి జిల్లాలో మద్యం మాఫియా

Submitted on 22 February 2020
Liquor Mafia in East Godavari District

తూర్పుగోదావరి జిల్లాలో అక్రమ మద్యం ఏరులై పారుతోంది. నూతన మద్యం పాలసీని ఆసరాగా తీసుకుని మద్యం మాఫియా రెచ్చిపోతుంది. యానాంతో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున మద్యాన్ని తరలించి యథేచ్చగా అమ్ముతూ.. ప్రభుత్వం తలపెట్టిన మద్యపాన నిషేదానికి తూట్లు పొడుస్తున్నారు. పోలీసులు, ఎక్సైజ్ శాఖ పట్టించుకోక పోవడంతో మద్యం మాఫియా మూడు ఫుల్లులు... ఆరు బీర్లులా సాగుతోంది.

ఏపిలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన.. మద్యపాన నిషేధానికి అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. మద్యపాన నిషేదం అమలులో భాగంగా ప్రభుత్వ వైన్ షాపులను ఏర్పాటు చేయడమే కాకుండా.. మద్యం అమ్మే వేళలను, షాపులను సైతం కుదించింది. గతంలో తూర్పుగోదావరి జిల్లాలో 540 వైన్ షాపులు ఉండగా వాటిలో 20 శాతం తగ్గించింది. దీంతో జిల్లాలో 426 షాపులు మాత్రమే నడుస్తున్నాయి. ఇక మద్య బ్రాండులు కూడా బాగా తగ్గించింది.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీ అక్రమార్కుల పాలిట వరంగా మారింది. జిల్లాలోని మద్యానికి ఉన్న గిరాకీను ఆసగా చేసుకుని కొంతమంది అక్రమార్కులు మాఫియాగా ఏర్పడ్డారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం యానాం.. ఏజెన్సీ సరిహద్దులో ఉన్న తెలంగాణా రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున మద్యాన్ని అక్రమ మార్గంలో జిల్లాకు తరలిస్తున్నారు. ఇలా అక్రమ మార్గాల్లో తరలించిన మద్యానికి డెబుల్ రేటు రావడంతో అక్రమార్కులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. మరో వైపు కల్తీ మద్యం, నాటు సారా అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. 

ఏపీలో గత ఏడాది అక్టోబర్ 1 నుండి నూతన మద్యం పాలసీ అమలులోనికి రాగా.. నాలుగు నెలల కాలంలో అక్రమ మద్యానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 197 కేసులు నమోదయ్యాయి. వీరిలో 105 మందిని అరెస్ట్ చేశారు. ఇక అక్రమ మార్గంలో ఇతర రాష్ట్రాల నుండి మద్యం తరలించిన కేసుల్లో 44 మందిని బైండోవర్ చేసి.. 16 వాహనాలను సీజ్ చేసారు. బెల్టు షాపులు నిర్వహిస్తున్న 275 మందిని అదుపులోకి తీసుకున్నారు. నాటు సారా తయారు చేస్తున్న 1 వేయి 259 మందిని అరెస్టు చేసారు. మరోవైపు అక్రమ మద్యాన్ని పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు నియంత్రించట్లేదన్న విమర్శలు వస్తున్నాయి. అక్రమ మద్యం రవాణా వెనుక రాజకీయ ఒత్తిళ్ళు కూడా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

Read More :  Loan dues : రాయపాటి..సుజనా ఆస్తుల వేలం

Liquor Mafia
East Godavari
District
ycp govt

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు