నన్ను చంపేస్తారు : భయాందోళనలో జబర్దస్త్ వినోద్

Submitted on 22 July 2019
life threat for jabardast comedian vinod

జబర్దస్త్ కమెడియన్ వినోద్ పై దాడి సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇంటి ఓనరే తనపై దాడి చేశాడని వినోద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. తాజాగా వినోద్ మరోసారి పోలీసులను ఆశ్రయించాడు. తనకు ఇంటి ఓనర్ నుంచి ప్రాణహాని ఉందన్నాడు. నన్ను, నా కుటుంబాన్ని చంపేస్తారు అని వినోద్ ఆందోళన వ్యక్తం చేశాడు. తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరాడు. తనపై దాడి తర్వాత ఇప్పుడు ఇంటికి నీటి సరఫరా బంద్ చేశారని వినోద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి నుంచి తనను వెళ్లగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పాడు. తనకు న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను వేడుకున్నాడు.

జబర్దస్త్ కామెడీ షోలో వినోదిని పేరుతో లేడీ గెటప్‌తో పాపులర్ అయ్యాడు వినోద్. హైదరాబాద్‌ కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుత్బిగూడలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. వినోద్‌పై ఇంటి ఓనర్ దాడి చేశారు. ఈ దాడిలో వినోద్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి కంటికి బలైమన గాయమైంది. ఇంటి ఓనర్ తనపై హత్యాయత్నం చేసినట్టు కాచిగూడ పోలీసులకు వినోద్ ఫిర్యాదు చేశాడు. ఈ గొడవకు ఇంటి వివాదమే కారణం అని వినోద్ చెప్పాడు.

4 నెల‌ల క్రితం వినోద్ తాను ఉంటున్న 70 గ‌జాల ఇంటిని కొనుగోలు చేసేందుకు య‌జ‌మానికి రూ.10ల‌క్ష‌లు అడ్వాన్స్ ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడు. అయితే అడ్వాన్స్ తీసుకున్న తర్వాత ఆ ఇంటిని అమ్మనని ఓనర్ చెప్పాడు. అంతేకాదు అడ్వాన్స్ కూడా తిరిగి ఇవ్వను అని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం రేగింది. శ‌నివారం(జూలై 20,2019) వినోద్ ఇంటి ఓనర్ ని నిలదీశాడు. ఇంటి య‌జ‌మానితో పాటు అత‌ని భార్య, కొడుకులు వినోద్‌పై దాడికి దిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ దాడిలో వినోద్ కంటికి, త‌ల‌కు తీవ్ర‌గాయాలు అయ్యాయి. తనను గోడకేసి గుద్దారని, గొంతు నులిమి చంపబోయారని వినోద్ ఆరోపించాడు. ఇంటికోసం తాను ఇచ్చిన రూ. 10 లక్షలు వెనక్కి ఇవ్వాలని అడగడంతో తనపై దాడి చేశారని వినోద్ తెలిపాడు. 

దాడి కేసులో పోలీసులు వినోద్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసామని కాచిగూడ సీఐ హబీబ్ ఖాన్ చెప్పారు. వినోద్‌పై ఐదుగురు దాడికి పాల్పడ్డారని అన్నారు. దాడికి పాల్పడ్డ వారిలో బాలాజీ, ప్రమీలను అరెస్ట్ చేశామన్నారు. ఐదుగురిపై ఐపీసీ సెక్షన్‌ 304, 323, రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Vinod
life threat
jabardast
house owner
Kachiguda
Attack
Comedian

మరిన్ని వార్తలు