తల్లో పేల సమస్యా :  స్మార్ట్‌ఫోన్‌ వల్లే కావచ్చు

Submitted on 10 March 2019
The lice is related to the smartphone to be spaced

తలలో పేను కుట్టిందంటే..ఆటోమేటిగ్గా మనం ఎంతటి పనిలో ఉన్నా..మన చేయి పేను కుట్టిన చోటికి పోవాల్సిందే..గోక్కోవాల్సిందే. తల్లో పేలు పెట్టే ఇబ్బంది అంతా ఇంతా కాదు..వినటానికి ఇది పెద్ద సమస్య కాకపోయినా..అనుకున్నంత చిన్న సమస్య అయితే మాత్రం కాదు. కానీ తల్లో పేలు పెరగటానికి స్మార్ట్ ఫోన్లకు లింకేంటి అనే ప్రశ్న వచ్చింది. కానీ స్మార్ట్ ఫోన్ వినియోగానికి  పేలకు సంబంధముందంటున్నారు స్కిన్ స్పెషలిస్టులు.
 

సాధారణంగా స్మార్ట్ ఫోన్ ల వల్ల పేలు వ్యాపించవు కానీ..యువతీ యువకులు ఎక్కువగా సెల్ఫీలు తీసుకునేటప్పుడు.. సరదాగా వీడియోలు, ఫొటోలు చూసేటప్పుడు ఒకే ఫోన్ ముందు తలలు దగ్గరగా పెట్టి చూస్తుంటారు. అప్పుడు ఒకరి జుట్టు మరికొరి జుట్టుకు తగటం..రాజుకోవటం ద్వారా పేలు ఒకరి నుంచి మరొకరికి సులువుగా వ్యాపిస్తాయంటున్నారు స్పెషలిస్టులు. 

పేలకు ఎగరటం రాదు.. దూకటం రాదు మరి ఎలా 
తల్లో పేలు ఎగరలేవు, దూకలేవు. కానీ మరో కొత్త వ్యక్తి జుట్టు తాకగానే..ఆ వెంట్రుకల వెంట వేగంగా పాకుతూ మరో తల్లోకి ప్రవేశించేస్తాయి. ఆ కొత్త తల మీదకు చేరి కొత్త ఆవాసంలో గుడ్లు పెడతాయి.

ఎవరి  తలలోనైనా  పేలున్నాయని తెలిసేలోపే అవి ఇతరులకూ వ్యాపించేస్తాయి. చూడటానికి చిన్నదే అయినా అవి అంత ఫాస్ట్ గా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించిపోతాయి.  పేలు వచ్చాక వెంటనే తెలియదు. కొన్ని రోజుల తర్వాత అలర్జీ లాంటి లక్షణాలు కనిపించటంతో పేలు ఉన్నట్లుగా తెలుస్తుందంటున్నారు నిపుణులు. మనిషి తల మీద కొద్ది కాలంపాటు మాత్రమే పేలు బతకగలవట. జంతువుల నుంచి మనుషులకు ఈ పేలు వ్యాపించవట. మనిషి నుంచి మనిషికే వ్యాపిస్తాయి. జంతువుల మీద అవి సంతోషంగా బతకలేవు" అని టెస్ మెక్‌ఫర్సన్ అనే స్కిన్ స్పెషలిస్ట్. కాగా..పేల సమస్య పేల సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆమె సూచిస్తున్నారు. లేదంటే అవి తలకు కొరికి విపరీతమైన ఇన్ ఫెక్షన్లకు దారి తీసే ప్రమాదముంటుందని హెచ్చరిస్తున్నారు. మరి పేలు చిన్నవే కదాని నిర్లక్ష్యం చేయొచ్చు..ఆరడగుల మనిషినైనా నువ్వు గింజంత కూడా లేని పేను సమస్య సృష్టించగలదు. 

Lice
Smart Phone
Tess McFarlons
Skin Specialist

మరిన్ని వార్తలు