ఇక్రిశాట్ లో చిరుత : భయాందోళనలో ఉద్యోగులు

Submitted on 11 February 2019
Leopard wandering in Patan Cheru icrisat

సంగారెడ్డి : పటాన్ చెరు ఇక్రిశాట్ లో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. గతంలో ఒకసారి చిరుతను గుర్తించిన ఇక్రిశాట్ భద్రతా సిబ్బంది.. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. తాజాగా మరోసారి చిరుత సంచారాన్ని గుర్తించిన ఇక్రిశాట్ అధికారులు అటవీశాఖ అధికారుల దృష్టికి తెచ్చారు. చిరుత సంచారాన్ని పరిశీలించేందుకు అటవీశాఖ అధికారులు ఇక్రిశాట్ కు వచ్చారు. అటవీశాఖ అధికారులు ఇక్రిశాట్ ను క్షుణ్ణంగా పరిశీలించారు.

 

ఫారెస్టు ఆఫీసర్లు చిరుతను బందించలేకపోయారు. చిరుత సంచరిస్తున్నట్లు కూడా ధృవీకరించలేదు. దీంతో ఇక్రిశాట్ ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. 
 

leopard
wandering
Patan Cheru icrisat
Sangareddy

మరిన్ని వార్తలు