అమ్మ బాబోయ్ : మంచం కింద చిరుత పులి 

Submitted on 6 February 2019
Leopard tiger under the bed in home

చెన్నై : సాధారణంగానే పులులు, సింహాలు అంటేనే అందరికీ భయం. మామూలుగా సినిమాలో కనిపించే పులిని చూస్తేనే భయమేస్తోంది. ఊరిలోకి పులి ప్రవేశిస్తే జనం గజ గజ వణుకుతూ పరుగులు తీస్తారు. అలాంటిది ఏకంగా పులి ఇంట్లోకి ప్రవేశించి, ఆపై మంచం కింద ఉంటే పరిస్థితి ఏలా వుంటుందో చెప్పక్కర్లేదు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి తమిళనాడులో చోటుచేసుకుంది.

తమిళనాడు నీలగిరి జిల్లాలో ఒక చిరుతపులి ఓ ఇంటిలోకి చొరబడి గ్రామస్తులను పరుగులు పెట్టించింది. ప్రజలు భయంతో పరుగులు తీశారు. నీలగిరి జిల్లా పందలూరు తాలుకా సమీపంలో కొండ గ్రామ కైవట్టాకి చెందిన రైతు రాయిన్ తోటలో పనికి వెళ్లి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో మంచం కింద ఏదో చప్పుడు వినిపించింది. కిందికి చూడగా చిరుతపులి కనిపించింది. దీంతో రాయిన్ అతని భార్య భయంతో బయటకు పరుగులు తీసి ఇంటికి తాళం వేశారు. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో చిరుతను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సమాచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు రాయిన్ ఇంటి వద్దకు చేరుకున్నారు. ఫిభ్రవరి 5 మంగళవారం రోజు రాత్రి కావడంతో బుధవారం చిరుతను పట్టుకుంటామని అధికారులు తెలిపారు. 

Leopard tiger
under the bed
home
tamilnadu

మరిన్ని వార్తలు