ఇంకా షాక్ లోనే షాద్ నగర్ : సడెన్ గా మేడ మీద ప్రత్యక్షమైన పులి

Submitted on 21 January 2020
Leopard on terrace of Shadnagar house captured

షాద్‌నగర్‌లో ఓ చిరుత పులి హల్‌ చల్‌ చేసింది. ఓ ఇంటి మేడపైకి ఎక్కి కలకలం రేపింది. అరణ్యంలో ఉండాల్సిన చిరుతను జనారణ్యంలో చూసి హడలిపోయారు స్థానికులు. అయితే..అటవీ సిబ్బంది తమదైన శైలిలో చిరుతను బంధించారు. సడన్‌గా ఇంటి మేడపై చిరుతపులి ప్రత్యక్షం కావడంతో.. ఇంకా షాక్‌లోనే ఉన్నారు షాద్‌నగర్‌ వాసులు.

1

మేడపైకి చేరి హాయిగా సేద తీరింది:
కొన్ని రోజులుగా హైదరాబాద్ పట్టణ శివార్లలో చిరుత సంచరిస్తుందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. కొంతమంది ఈ వార్తలను కొట్టేసినప్పటికీ ఇప్పుడు మాత్రం నమ్మక తప్పదు. అసలు ఆ చిరుత ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ.. ఓ ఇంటి మేడపైకి చేరి హాయిగా సేదతీరింది. కాస్త టైంపాస్ చేయడానికి అటూ ఇటూ పచార్లు కూడా కొట్టింది. అలా ఎప్పటి నుంచి ఆ చిరుత డాబాపైన ఉందో తెలియదు కానీ.. దాన్ని గమనించిన స్థానికులు ఒక్కసారిగా షాకయ్యారు. 

2

కాసేపు పూల కుండీల మధ్య నిద్ర:
అసలు విషయానికొస్తే.. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని పటేల్ రోడ్డులో చిరుత పులి హల్‌ చల్ చేసింది. అర్ధరాత్రి పటేల్ రోడ్డుకు వచ్చిన చిరుత.. మన్నే విజయ్ కుమార్ అనే వ్యక్తి ఇంటిపైకి ఎక్కి దాక్కుంది. పూల కుండీల మధ్యలో నిద్రించింది. పక్కనే కమ్మదనం అటవీక్షేత్రం ఉంది. చాలా రోజులుగా చిరుతపులి అక్కడ సంచరిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ నిజంగా చిరుతపులి షాద్‌ నగర్ పట్టణంలోని నడిబొడ్డులో ప్రత్యక్షం కావడంతో జనం భయాందోళన చెందారు. 

3

జనారణ్యంలో చిరుతల సంచారం కామన్:
ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఫారెస్ట్ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని చిరుతకు మత్తు మందు ఇచ్చి దానిని బంధించారు. అనంతరం దానిని జూకు తరలించారు. అయితే.. చిరుతను బంధించే క్రమంలో ఓ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయని తెలిపారు పోలీస్‌ అధికారి. మరోవైపు అటవీ ప్రాంతాలు ఉన్నచోట చిరుతల సంచరించడం సాధారణమే అంటున్నారు అటవీశాఖ అధికారులు. చిరుత సంచారం గురించి తమకు సమాచారం అందిన వెంటనే స్పందిస్తున్నామని తెలిపారు. అటవీ ప్రాంతాలకు దగ్గర్లో నివసించేవారికి అన్ని జాగ్రత్తలు సూచిస్తున్నామని చెప్పారు. 

మొత్తానికి 5 గంటలపాటు సాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్‌ విజయవంతంగా ముగియడంతో అటవీశాఖతోపాటు పోలీస్‌ అధికారులు సైతం ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు షాద్‌నగర్‌ వాసులు మాత్రం ఇంకా షాక్‌లోనే ఉన్నారు. 

Also Read : బాయ్‌ఫ్రెండ్‌ను చితకబాది యువతిపై సామూహిక అత్యాచారం

leopard
Shadnagar
Terrace
house
Caught
Forest
patel road
Shock

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు