డెత్ ఫైట్ : చిరుత-కొండచిలువ పోట్లాట.. గెలిచిందెవరో?

Submitted on 20 November 2019
Leopard And Python Caught In A Death Match Video Viral

ఒకవైపు చిరుతపులి.. తన పంజాతో ఎంతంటి జంతువునైనా ఇట్టే చీల్చిపారేయగలదు. మరోవైపు కొండచిలువ.. తన బలమైన శరీరంతో చుట్టేసి ఊపిరిఆడకుండా చేయగలదు. పెద్ద జంతువునైనా అమాంతం మింగేయగలదు కూడా. ఈ రెండు అంతంటి శక్తివంతమైనవి. సాధారణంగా ఈ రెండెంటి మధ్య పోట్లాట చాలా అరుదు. కెన్యాలోని మాసాయి మారా ట్రైయాంగిల్ రిజర్వ్ ప్రాంతంలో చిరుత, కొండచిలువ తలపడ్డాయి. నువ్వానేనా అంటూ బరిలోకి దిగాయి. రోమాలు నిక్కపొడిచేలా భీకర పోరు జరిగింది. 

ఈ పోరులో కొండచిలువ.. చిరుతను చుట్టేసేందుకు విశ్వప్రయత్నం చేసింది. కొండచిలువ పట్టుకు దొరక్కండా తన వాడియైన పంజాతో పైతాన్ పని పట్టింది. రెండూ పోటాపోటాగా తలపడ్డాయి. సాధారణంగా, ఈ డెత్ ఫైట్‌లో కొండచిలువ చిరుతను చంపి మింగేస్తుందని అందరూ ఊహిస్తారు. కానీ, ఇక్కడ అలా జరగలేదు. సీన్ రీవర్స్ అయింది. చిరుత పంజా దెబ్బకు కొండచిలువే విలవిలలాడిపోయింది.

చిరుత తన పళ్లతో కొండచిలువ మెడ కొరికేసి చంపేసింది. సఫారీ టూర్ లో జరిగిన ఈ పోరును దగ్గర నుంచి వెల్టన్ అనే పర్యాటకుడు వీడియోను తన కెమెరాలో బంధించాడు. ఇప్పుడా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చివరిలో చిరుత లేదా కొండచిలువా? ఎవరు గెలిచారో మీరే చూడండి.

leopard
Python
Death Match
Maasai Mara Triangle Reserve
 

మరిన్ని వార్తలు