హైదరాబాద్ లో మాయలేడీ అరెస్ట్

Submitted on 8 November 2019
Lawyer arrested for cheating in the name of friendship

యువకులను మాయ మాటలతో లోబర్చుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు కాజేస్తున్నమాయ లేడి షాదాన్ సుల్తానా నిజామీ(26)ని అబిడ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అబిడ్స్ సిఐ రవికుమార్ అందించిన వివరాల ప్రకారం.. మలక్ పేట్ ప్రాంతానికి చెందిన షాదాన్ సుల్తానా ఎల్.ఎల్.బి పూర్తి చేసి అడ్వొకేట్ గా ప్రాక్టీస్ చేస్తోంది. ఆమెకు అబిడ్స్ లోని మైనారిటీ ఎడ్యుకేషన్ సంస్థలో కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగం చేస్తున్న అసిస్టెంట్ సూపర్వైజర్ రహీంతో 2015 లో పరిచయం ఏర్పడింది. అప్పటి నుండి తరుచూ ఫోన్లలో మాట్లాడుతూ, హోటల్స్ కు, షికార్లకు కలిసి తిరగారు ఇద్దరు. డబ్బులు అవసరం ఉన్న ప్రతిసారి షాదాన్ రహీం వద్ద తీసుకునేది. 

ఈ పరిచయం బలపడిన తర్వాత ఆమె, రహీంను  బ్లాక్ మెయిల్ చేయసాగింది. వారి మధ్య ఉన్న సన్నిహిత్యాన్ని బయటపెడతానని బెదిరిస్తూ డబ్బులు తీసుకుంటుండేది. ఆరునెలల కింద అతని వద్ద నుండి 3 లక్షల రూపాయలు తన అకౌంట్లోకి ట్రాన్స్ ఫర్ చేయించుకుంది. మరోసారి ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేకపోతే తనను వేధిస్తున్నాడని పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. దీనితో విసుగు చెందిన రహీం గతనెల అక్టోబర్ 19న అబిడ్స్ లో తను పనిచేస్తున్న కార్యాలయం సమీపంలో నిద్రమాత్రలు మింగి అత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ జరిపి షాదాన్ సుల్తానాను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సిఐ తెలిపారు.

తన బ్లాక్ మెయిల్ పనులకు షాదాన్ సుల్తానా, రహీంను పావుగా వాడుకొని, ఇదే తరహాలో పలువురు యువకులను ట్రాప్ చేసినట్లు బాధితుడు రహీం పోలీసులకు తెలిపాడు. వారికి దగ్గరై, వారితో డబ్బులు తీసుకొని, తిరిగి వారిపైనే కేసులు పెట్టేదని రహీం పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ లో పేర్కొన్నాడు. ఆ కేసులకు గాను అతన్నే విట్నెస్ గా పెట్టేదని, ఆ కేసులను విత్ డ్రా చేసుకొనేందుకు డబ్బులు కూడా డిమాండ్ చేసేదని తెలిపాడు.  


రహీం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న అబిడ్స్ ఎసై రవి విచారణ చేపట్టారు. విచారణలో షాదాన్ సుల్తానా పై పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. షాదాన్ ఇప్పటి వరకు నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో 25 మంది యువకులపై ఫిర్యాదు చేసింది. అందులో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో శిరీష అగర్వాల్, మలక్ పేట పోలీస్ స్టేషన్ లో సుజన్ ఖాన్ అనే తప్పుడు పేర్లతో ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా షాదాన్ సుల్తానాను.. ఆమె తండ్రి తిడుతూ, వేధిస్తున్నాడని చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ లో తండ్రి పైనే ఫిర్యాదు చేయడం కొసమెరుపు. ఈమెపై కూడా అంబర్ పేటలో ఎస్సీ, ఎస్టీ కేసు, చిలకలగూడా, మలక్ పేట, ఉప్పల్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. రహీం ఫిర్యాదుతో షాదాన్ సుల్తానా పై ఐపీసీ 384,385, 195(A) సెక్షన్లపై కేసు నమోదు చేసి పోలీసులు రిమాండ్ కు తరలించారు.

Telangana
lawyer. abids police
crime
cheating

మరిన్ని వార్తలు