'లక్ష్మీబాంబ్' రీమేక్ - లారెన్సే దిక్కు

Submitted on 27 May 2019
Lawrence to Reconsider Firecting Laxmmi Bomb

తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ అయిన కాంచన సినిమాని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, కైరా అద్వాణీ జంటగా 'లక్ష్మీబాంబ్' పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. లారెన్స్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ వివాదం కారణంగా లారెన్స్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు చిత్ర నిర్మాతలు వెనక్కి తగ్గి, లారెన్స్‌నే లక్ష్మీబాంబ్ సినిమాని డైరెక్ట్ చెయ్యమన్నారని, ఇందుకు గానూ, లారెన్స్‌తో సమావేశం అయ్యారని లారెన్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. మూవీ టీమ్ తనకు దర్శకుడిగా తగిన ఇంపార్టెన్స్ ఇవ్వలేదనే వాస్తవాన్ని అంగీకరించిన నిర్మాతలు లారెన్స్‌తో మాట్లాడి, ప్రాజెక్ట్ చేపట్టాలని రిక్వెస్ట్ చేసారని, లారెన్స్ కూడా అంగీకారం తెలిపాడని కోలీవుడ్ సమాచారం.

Raghava Lawrence
Akshay Kumar
Kiara Advani

మరిన్ని వార్తలు