నా కొడుకు లోకేష్ మీద ఒట్టు : లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ 2

Submitted on 8 March 2019
Lakshmi's NTR Movie Trailer 2 | NTR True STORY | RGV

లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ ట్రైలర్ విడుదల చేశారు రాంగోపాల్ వర్మ. ఉమెన్స్ స్పెషల్ అంటూ కోట్ చేశారు. ఎన్టీఆర్ - లక్ష్మీపార్వతి పెళ్లి విషయాన్ని హైలెట్ చేయటంతోపాటు.. ఎన్టీఆర్ ను ఎలా పదవి నుంచి దించేశారు అనేది చూపించారు. చంద్రబాబు-లక్ష్మీపార్వతి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆసక్తి రేపుతోంది. నా కొడుకు లోకేష్ పై ఒట్టు అంటూ చెప్పిన విషయం కలకలం రేపుతోంది. 
Also Read : మళ్లీ బాలయ్యకు టికెట్

‘మీరనుకున్నట్లు ఆమె మంచి మనిషి కాదు..ఇంతకు ముందే ఆవిడతో ఎఫైర్స్ ఉన్నాయి.. టైం రాదు.. టైం తీసుకోవాలి అంటూ చంద్రబాబు చెప్పే డైలాగ్స్ ఆసక్తిగా మారాయి. జయసుధ, జయప్రద ఎందరో మహామహా నటీమణులతో నటించిన ఆయనకు దానిలో ఏముందో’ అనే భారీ డైలాగ్స్ పెట్టటం విశేషం. ఈ ట్రైలర్ కు కూడా ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. 

ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంట్రీ నుంచి పదవి కోల్పోయే వరకు జరిగిన అన్ని సంఘటనలను రివిల్ చేశారు ట్రైలర్ లో. నటుడు విజయ్ కుమార్ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తుండగా.. యజ్ఞ శెట్టి లక్ష్మీ పార్వతిగా నటిస్తుంది. చంద్రబాబుగా శ్రీతేజ్.. బాలయ్యగా ఆర్.జె.బాలు నటించారు.
Also Read : హనీ ఈజ్ ది బెస్ట్ : ట్రెండింగ్ లో ఎఫ్ 2 డిలీటెడ్ సీన్

Lakshmi's NTR
movie
Trailer 2
NTR True STORY
RGV
Laxmi Parvathi

మరిన్ని వార్తలు