ఆకతాయి అసభ్య ప్రవర్తన : చెంప పగలగొట్టిన ఖుష్బూ

Submitted on 12 April 2019
Kushboo slaps man for misbehaving

ప్రముఖ నటి, కాంగ్రెస్ పార్టీ నేత ఖుష్బూ ఓ ఆకతాయి చెంప పగలగొట్టింది. అసభ్యంగా ప్రవర్తించిన అతడికి బుద్ధి చెప్పింది. కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తి వెనుక నుంచి తన పట్ల  అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో ఆగ్రహించిన ఖుష్బూ వెంటనే అతడి చెంప చెళ్లుమనిపించింది. బెంగళూరులో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి నేత, బెంగళూరు సెంట్రల్ లోక్ సభ స్థానం అభ్యర్థి రిజ్వాన్ అర్షాద్ తరుఫున  ఖుష్బూ ప్రచారంలో పాల్గొంది.
Read Also : మంగళగిరిలో ఉద్రిక్తత : ధర్నాకు దిగిన లోకేష్

భారీ జనసందోహం మధ్యలో ఖుష్బూ నడుస్తోంది. ఇంతలో వెనుక నుంచి ఓ వ్యక్తి ఆమెను అభ్యంతరకర రీతిలో తాకాడు. దాంతో, ఖుష్బూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ వ్యక్తి చెంపలు  వాయించింది. ఇంతలో పోలీసులు, కార్యకర్తలు వెంటనే స్పందించి ఆ యువకుడిని ర్యాలీ నుంచి బయటికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ముందు ఓసారి తాకినా వెనక్కి తిరిగి చూసి ప్రచారంలో మునిగిపోయాను అని ఖుష్బూ చెప్పింది. మళ్లీ అదే పని చేయడంతో ఒళ్లు మండి ఒక‍్కటిచ్చానని తెలిపింది. ఖుష్బూ మంచి పని చేశారని నెటిజన్లు  అంటున్నారు. ఆమెకు మద్దతుగా నిలిచారు. ఆడవారితో అసభ్యంగా ప్రవర్తించే వారిపట్ల ఇలాగే స్పందించాలని, వారికి గుణపాఠం చెప్పాలని అన్నారు.

Read Also : బద్దకించిన నగరవాసులు : హైదరాబాద్‌లో తగ్గిన పోలింగ్

Kushboo
slaps
man
misbehaving
touch
BENGALURU
karnataka

మరిన్ని వార్తలు