ఆ ఒక్క డెలీవరీపై కుల్దీప్‌ను పొగిడేస్తున్న ఐసీసీ

Submitted on 17 June 2019
Kuldeep Yadav's sensational delivery to Babar Azam

మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫ్పోర్డ్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 89పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ భారీ టార్గెట్ నిర్దేశించింది. చేధనకు దిగిన పాకిస్తాన్‌ను భారత బౌలర్లు చిత్తుగా ఓడించారు. ఈ క్రమంలో బాబర్ అజామ్‌కు కుల్దీప్ యాదవ్ వేసిన బంతిపై ఐసీసీ స్పందిస్తూ ట్వీట్ ద్వారా అభినందన తెలియజేసింది.

ఫకార్ జమాన్.. బాబర్ అజామ్ దూకుడుగా ఆడటంతో 23 ఓవర్లకు 113/1తో పాక్‌ మంచి స్థితిలో నిలిచింది. 23.6పరుగుల వద్ద ఇన్నింగ్స్ చక్కదిద్దుకునేలా కనిపిస్తోంది. అలాంటి దశలో బౌలింగ్‌కు దిగిన కుల్దీప్ యాదవ్.. పాక్ ప్రధాన వికెట్‌ను పడగొట్టాడు. 
చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వేసిన బంతికి అజామ్‌ అవుట్ అవడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. 

ఆఫ్‌స్టంప్‌ మీదుగా పడిన బంతి అనూహ్యంగా టర్న్‌ తీసుకొని లోపలికి దూసుకొచ్చింది. బయటి వైపు నుంచి  ప్రయత్నించిన బాబర్‌ అంచనా పూర్తిగా తప్పింది. బంతి.. బ్యాట్, ప్యాడ్‌‌ల మధ్య నుంచి దూసుకు వచ్చి బెయిల్స్‌ను పడగొట్టింది. ఆ బంతి వచ్చిన దిశను ఒకటికి రెండు సార్లు చూసుకుని వెనుదిరిగి వెళ్లిపోయాడు. 

ఆ వీడియోను ఐసీసీ ట్వీట్ చేస్తూ.. నిన్నటి మ్యాచ్‌లో సెన్సేషనల్ డెలీవరీ అంటూ పోస్టు చేసింది. 

Kuldeep Yadav
babar azam
india
Team India
Pakistan
2019 icc world cup
world cup 2019


మరిన్ని వార్తలు