పార్టీ గుర్తుపై గెలిచిన మేం చేదయ్యామా? : కొండా సురేఖ

12:40 - September 8, 2018

హైదరాబాద్ : తనపై ఒత్తిడి చేసి వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేయించారని కొండా సురేఖ పేర్కొన్నారు. కేసీఆర్ మాట మేరకు వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేశానని తెలిపారు. పార్టీ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఎన్నికల్లో గెలిచానని తెలిపారు. వరంగల్ ఎంపీ సీట్ నుంచి కడియం నిలబడితే ఖర్చంతా తామే పెట్టుకున్నామన్నారు. ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ తామే ఖర్చు పెట్టామని తెలిపారు. ఆయన ముద్దై, పార్టీ గుర్తుపై గెలిచిన మేం చేదయ్యామా? అని ప్రశ్నించారు. తనకు మంత్రి పదవి, మురళికి ఎమ్మెల్సీ ఇస్తామని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదన్నారు. తనకు, మురళికి బిఫామ్ లు తప్ప టీఆర్ ఎస్ నుంచి తమకేమీ రాలేదన్నారు. 

Don't Miss