క్లారిటీ ఇచ్చేశారు : TDP కోసం ప్రచారం చేస్తా - కొణతాల

Submitted on 22 March 2019
Konathala Ramakrishna Support TDP

అందరూ అనుకున్నట్లే జరిగింది. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ క్లారిటీ ఇచ్చేశారు. టీడీపీకే జై కొట్టారు. గతవారం జగన్ సమక్షంలో YCPలో చేరాలని భావించిన కొణతాల.. కండువా కప్పుకునే సమయంలో పార్టీలో చేరకుండా ఆగిపోయారు. వైసీపీని వీడి టీడీపీలో చేరినా అక్కడా సీటు దక్కలేదు. ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధించే సత్తా టీడీపీకే ఉందని మార్చి 22వ తేదీ శుక్రవారం కొణతాల ప్రకటించారు. టీడీపీ అనుమతిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఆ ఆ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. 

మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్‌‌గా ఉన్న కొణతాల రామకృష్ణ ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఆయన టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తేలిపోయింది. తాజాగా టీడీపీకి మద్దతు ప్రకటించడంతో వైసీపీపై ప్రభావం ఉంటుందా ? అనే చర్చ జరుగుతోంది. అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండకపోయినా...విశాఖ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఖచ్చితంగా వైసీపీపై ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి వైసీపీ పార్టీని దెబ్బతీయడంలో కొణతాల సక్సెస్ అవుతారా ? లేదా ? అనేది చూడాలి. 

Konathala Ramakrishna
Support
TDP
andhrapradesh
Konathala

మరిన్ని వార్తలు