మోడీ రైతు బంధు : 24న మీ ఖాతాల్లో రూ.2వేలు

Submitted on 21 February 2019
Kisan Samman Nidhi, Farmers To Get Rs 2 Thousand On Feb 24th

హైదరాబాద్: రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద 5 ఎకరాలలోపు వ్యవసాయ భూమి ఉన్న  రైతులందరికి ఏటా రూ.6వేలు పెట్టబడి సాయంగా ఇవ్వనున్నారు. ఆ మొత్తాన్ని త్వరలోనే రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. ముందుగా ఫిబ్రవరి 24వ తేదీన రూ.2వేల చొప్పున ఇవ్వనున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 13.36 లక్షలమంది రైతులు మోడీ రైతు బంధు పథకానికి అర్హత సాధించారు. వారందరి బ్యాంకు ఖాతాల వివరాలను పీఎం కిసాన్‌ పోర్టల్‌‌లో అప్‌లోడ్‌ చేసినట్లు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి తెలిపారు.

మోడీ రైతుబంధు పథకానికి సంబంధించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏఈవోలతో క్షేత్ర స్థాయిలో సర్వే చేయింది వివరాలను సేకరించినట్లు పార్థసారథి తెలిపారు. సెంట్రల్‌ పోర్టల్‌లో ఫిబ్రవరి 19  తేదీ నుంచి డేటా అప్‌లోడ్‌ ప్రారంభించామని, ఈ వివరాల నమోదు నిరంతరం కొనసాగుతుందని, రైతులు కూడా సమగ్ర వివరాలు ఏఈవోలకు ఇవ్వాలని సూచించారు. ఫిబ్రవరి 20వ తేదీ నాటికి  రైతు బంధు పథకం కింద అందుబాబులో ఉన్న అర్హులైన రైతుల వివరాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా వివిధ దశల్లో  వడపోసిన రైతు కుటుంబాల సమాచారాన్ని వ్యవసాయ శాఖ పంపింది. సామాజికవర్గాల వారిగా చూస్తే ఇందులో ఎస్సీలు 2.46లక్షల మంది, ఎస్టీలు 1.48లక్షల మంది ఉండగా, ఇతర కేటగిరీల్లో  9.41లక్షల మంది రైతులు ఉన్నారు.

జిల్లాల వారీగా అర్హులు:
ఆదిలాబాద్‌లో 22,021
భద్రాద్రి కొత్తగూడెంలో 21,083
జగిత్యాలలో 55,446
జనగామలో 34,834
జయశంకర్‌ భూపాలపల్లిలో 24,130
జోగులాంబ గద్వాలలో 28,596
కామారెడ్డిలో 51,466
కరీంనగర్‌లో 60,218
ఖమ్మంలో 43,108
కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 24,117
మహబూబాబాద్‌లో 14,707
మహబూబ్‌నగర్‌లో 54,071
మంచిర్యాలలో 29,424
మెదక్‌లో 64,444
మేడ్చల్‌- మల్కాజ్‌గిరిలో 5,414
నాగర్‌కర్నూల్‌లో 74,606
నల్గొండలో 77,345
నిర్మల్‌లో 48,931
నిజామాబాద్‌లో 41,138
పెద్దపల్లిలో 41,633
రాజన్న సిరిసిల్లలో 41,613
రంగారెడ్డిలో 52,944
సంగారెడ్డిలో 42,175
సిద్దిపేటలో 79,417
సూర్యాపేటలో 70,525
వికారాబాద్‌లో 53,390
వనపర్తిలో 48,103
వరంగల్‌ అర్బన్‌లో 34,292
వరంగల్‌ రూరల్‌లో 58,096
యాదాద్రి భువనగిరిలో 35,215

pm modi
kisan samman nidhi
Farmers
telangana farmers
beneficiaries
elgible farmers
investment

మరిన్ని వార్తలు