ఖమ్మం కార్పొరేషన్‌లో తిక్క టాక్ : Tik Tokతో ఉద్యోగులు బిజీ బిజీ

Submitted on 15 July 2019
Khammam Corporation Employees Tik Tok Videos

ఖమ్మం కార్పోరేషన్‌లో కొంతమంది ఉద్యోగులు తమ విధులను పక్కన పెట్టి, టిక్ టాక్‌లో టాలెంట్ చూపిస్తున్నారు. డ్యాన్సులు, డైలాగ్ లతో పాటు టిక్ టాక్ యాప్ లో వీడియోలు ఆప్ లోడ్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. గత కమిషనర్ కొందరిని హెచ్చరించారు. రికొందరికి నోటీసులు ఇచ్చారు. అయినా అక్కడి సిబ్బంది వైఖరి మార్పు కనిపించటం లేదు.  కార్పొరేషన్లో శానిటేషన్, రోడ్లు, డేత్, బర్త్ సర్టిఫికెట్లు కోసం ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. సర్టిఫికెట్ల కోసం వచ్చే వారికి మాత్రం తాము బిజీ బిజీగా ఉన్నామంటూ ఘాటుగా సమాధానం చెబుతున్నారు. 
Also Read : భయపడినట్లే జరిగింది :హైకోర్టు బయటే...సాక్షి దంపతుల కిడ్నాప్

ప్రజా సమస్యలను పరిష్కరించాలని సర్కార్ హెచ్చరిస్తున్నా..కొంతమంది అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఖమ్మం కార్పొరేషన్‌లో ఉద్యోగుల చేసిన నిర్వాకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఒక బర్త్ డే సర్టిఫికేట్ పొందడం కోసం నెల రోజుల సమయం పడుతోందని..చెప్పులరిగేలా తిరుగుతున్నామని..ఎన్నికలు ఉన్నాయంటూ..సాకులు చెపుతున్నారని స్థానికులు వెల్లడిస్తున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు టిక్ టాక్ చేస్తున్న వీడియోలు తమ దృష్టికి వచ్చాయని ఓ కార్పొరేటర్ తెలిపారు. దీనిపై కమిషనర్ చర్యలు తీసుకున్నారని వెల్లడించారు. 
Also Read : టిక్ టాక్ వీడియో తీసుకుంటూ బావిలో పడి చనిపోయిన యువతి

Khammam Corporation
employees
Tik Tok Videos

మరిన్ని వార్తలు