బిగ్‌బి KBC 11 కోటిశ్వరుడు ఇతడే : ఈ డబ్బులు మా నాన్నవి

Submitted on 14 September 2019
KBC 11 crorepati Sanoj Raj says the winning amount doesn’t belong to him: ‘This is my father’s money’

బాలీవుడ్ మెగా‌స్టార్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యహారిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి (KBC) 11 సీజన్ షోకు ఎంతో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. కేబీసీ షో బిగిన్ అయితే చాలు.. టీవీలకు ప్రేక్షకులు అతుకుపోతారు. పాపులర్ అయిన ఈ బిగ్ బి షోలో చోటు కోసం చాలామంది ప్రయత్నిస్తుంటారు. లక్కీగా ఛాన్స్ కొట్టేసిన వాళ్లు గేమ్ లో ఎక్కువ డబ్బులు గెల్చుకోలేక మధ్యలోనే చేతులేత్తేస్తుంటారు. కానీ, బీహార్ జెహనాబాద్ జిల్లాకు చెందిన సనోజ్ రాయ్ ఈ సీజన్ తొలి కోటిశ్వరుడిగా నిలిచాడు. గేమ్ లో భాగంగా రూ.7 కోట్ల జాక్ పాట్ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయినప్పటికీ రూ.కోటి సొంతం చేసుకున్నందుకు సంతోషంగా ఉందన్నాడు. తాను గెల్చుకున్న ఈ కోటి తన తండ్రికే చెందుతుందని చెప్పాడు. ‘నా తండ్రి ఒక రైతు. గెల్చుకున్న డబ్బు నేను ఆయనకు ఇవ్వడం లేదు. 

ఈ డబ్బు మా నాన్నదే. మా కుటుంబ పరిస్థితుల కారణంగా నాన్న చదువుకోలేకపోయాడు. అలాంటి పరిస్థితి మాకు ఎదురు కాకూడదని మమ్మల్ని బాగా చదివించాడు. అందుకే మేము చదువుపై దృష్టిపెట్టాం’ అని సనోజ్ చెప్పుకొచ్చాడు. సనోజ్ తల్లి ఇంట్లోనే ఉంటుంది. వారిది ఒక ఉమ్మడి కుటుంబం. తాత, అమ్మమ్మ, మామయ్య, అత్తయ్య, సోదరి, సోదరులు కలిసే ఉంటున్నారు. కేబీసీ గేమ్ షోకు సెలెక్ట్ అయిన 25ఏళ్ల సనోజ్.. తన తండ్రి, మామయ్యతో పాటు షో ఆడేందుకు వచ్చాడు. 

గేమ్ ఆడి 15వ ప్రశ్నకు సమాధానం చెప్పడంతో రూ. కోటి గెలుచుకున్నాడు. ఆ తర్వాత ఎదురైన రూ.7 కోట్ల ప్రశ్నకు సనోజ్ సమాధానం చెప్పలేకపోయాడు. దీంతో అతడు వెనుదిరగక తప్పలేదు.  ఏ భారతీయ బౌలర్ బౌలింగ్ లో సింగిల్ తీసి ఆస్ట్రేలియన్ లెజెండ్ డాన్ బ్రాడ్ మ్యాన్ 100వ ఫస్ట్ క్లాస్ సెంచరీ సాధించాడు? అని ప్రశ్నకు సనోజ్ తడబడ్డాడు. నిజానికి ఈ ప్రశ్నకు సమాధానం గోక్మల్ క్రిష్ణన్ చంద్. అప్పటికే లైఫ్ లైన్లు అన్నీ వాడేసిన సనోజ్.. అఖరి ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు. తన ఫైనల్ లైఫ్ లైన్ రూ.కోటి ప్రశ్నకే వాడేసినట్టు తెలిపాడు. 

ఐఏఎస్ అభ్యర్థిగి కేబీసీ షో కోసం అదనంగా ప్రీపేర్ కాలేదని, సివిల్ సర్వీసెస్ కోసం ప్రీపేర్ అవుతున్నానని చెప్పాడు. మెగా స్టార్ బిగ్ బిని కలిసే అవకాశం ఈ షో ద్వారా కలిగినందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నాడు. బిగ్ స్ర్కీన్ పై చూడటం తప్ప ఎప్పుడూ నేరుగా బిగ్ బిని కలవలేదని, మాట్లాడటం జరుగలేదని, కానీ, తనను కలిసి మాట్లాడినప్పుడు ఎప్పటినుంచో తెలిసిన వ్యక్తిలా ఆయన పలకరించడం చూసి ఆశ్చర్యపోయానని అన్నాడు.  

Amitabh Bachchan
KBC 11
crorepati
Sanoj Raj
my father’s money
Kaun Banega Crorepati 11
 IAS aspirant

మరిన్ని వార్తలు