నిజామాబాద్‌లో కవిత, మల్కాజిగిరిలో రేవంత్ : భారీగా నామినేషన్లు

Submitted on 22 March 2019
Kavitha, Revnath Reddy Files Nominations

తెలంగాణలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. మంచి ముహూర్తం కావడం, శని-ఆదివారం సెలవు కావడంతో.. శుక్రవారం(మార్చి 22,2019) ఒక్క రోజే భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ప్రధాన అభ్యర్థులంతా పత్రాలను సమర్పించారు. నిజామాబాద్‌లో క‌ల్వకుంట్ల క‌విత, మ‌హబూబాబాద్‌లో మాలోత్ క‌విత నామినేషన్ వేశారు. మ‌ల్కాజిగిరిలో రేవంత్‌, చేవెళ్లలో విశ్వేశ్వర్‌రెడ్డి నామినేషన్ వేశారు. 

సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత అత్తింటివారి ఆశీర్వాదం తీసుకుని లోక్ సభ బరిలో నిలిచారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి టీఆర్‌ఎస్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేశారు. నిజామాబాద్‌లో శుక్రవారం (మార్చి, 22) మధ్యాహ్నం ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. కవిత కుటుంబ సభ్యులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎంపీ కవిత నామినేషన్ దాఖలు చేశారు. నిజామాబాద్ ప్రజలకు మరోసారి సేవ చేసే అవకాశం కల్పించాలని కవిత కోరారు.
Read Also : సీటు గోవిందా..! : సిట్టింగ్‌లకు నో ఛాన్స్

మల్కాజ్ గిరి ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి నామినేషన్ వేశారు. లోక్ సభ ఎన్నికలు దేశ ప్రధానిని నిర్ణయిస్తాయని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అవుతారని చెప్పారు. టీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేవారికే కేసీఆర్ టికెట్లు ఇచ్చారని విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కేసీఆర్ అమ్ముడుపోయారని ఆరోపించారు. మల్కాజ్ గిరి మాజీ ఎంపీ మల్లారెడ్డికి పేమెంట్ కోటాలో మంత్రి పదవి వచ్చిందని రేవంత్ రెడ్డి విమర్శించారు.

టీఆర్ఎస్‌కు ఓటేస్తే కేసీఆర్‌కు ఇంతకంటే పెద్ద పదవి వచ్చే అవకాశం లేదని అన్నారు. టీఆర్ఎస్‌లో మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, సీతారాంనాయక్, వివేక్ వంటి వారికే దిక్కులేదని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. మల్కాజ్ గిరిలో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరిన రేవంత్ రెడ్డి... తాను గెలిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.
Read Also : ఏపీ ఎన్నికలు : పోటీలోని కోటీశ్వరులు వీరే

Telangana
loksabha elections
revanth reddy
kavitha
Nominations
TRS
Congress
konda visveshwar reddy

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు