ముంబైలో కసబ్ బ్రిడ్జి : ఆ పేరు ఎలా వచ్చింది

Submitted on 15 March 2019
Kasab Bridge in Mumbai has got that name

ముంబై: కసబ్ అంటే మనకు గుర్తుకొచ్చే పేరు పాకిస్థాన్ ఉగ్రవాది అని. ముంబైలో ఉగ్రదాడులకు పాల్పడి ఎంతోమంది ప్రాణాలను బలిగొన్న పాకిస్థాన్ కరడు కట్టిన ఉగ్రవాది కసబ్. ఆపేరుతో ముంబైలో ఉండే వంతెన ఘోర ప్రమాదానికి గురైంది.  పాక్ ఉగ్రవాదిపేరు ఆ బ్రిడ్జ్ కి ఎలా వచ్చిందో తెలుసుకుందాం..

కసబ్ బ్రిడ్జ్ కి ఆ పేరెలా వచ్చింది...
ముంబైలోని సీఎస్‌టీ నుంచి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా భవనం వైపు వెళ్లే ఈ పాదచారుల వంతెనను ‘కసబ్‌ బ్రిడ్జి’గా వ్యవహరిస్తారు. 2008 ముంబై ఉగ్రదాడుల సందర్భంగా ఉగ్రవాది కసబ్‌ ఈ బ్రిడ్జిపై వెళుతూ సీసీటీవీ కెమెరాలకు చిక్కడంతో అప్పటి నుంచి ఆ బ్రిడ్జికి  ఆ పేరు స్థిరపడిపోయింది. 
Read Also: కర్ణాటక మహిళా సాధ్వి మహాదేవి కన్నుమూత

7.30 గంటలకు కూలిన బ్రిడ్జ్ 
ప్రతీరోజు విధులు ముంగించుకున్న పలువురు   ఉద్యోగులు, కార్మికులు ఈ వంతెనపై నుంచి ఇళ్లకు బయలుదేరుతుంటారు. ఈ క్రమంలోనే సరిగ్గా రాత్రి 7.30 గంటల సమయంలో వారు బ్రిడ్జిపై వెళ్తుండగా..వంతెనలో కొంతభాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో బ్రిడ్జ్ పైనుంచి నడుచుకుంటే వెళ్లేవారంతా అంతెత్తు నుంచి రోడ్డుపై పడిపోయారు. ఈ సందర్భంగా బ్రిడ్జి శిథిలాలు కుప్పకూలడంతో పాదచారులంతా వాటికింద చిక్కుకుపోయారు. అంతేకాదు ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి కింద నడుచుకుంటూ వెళుతున్న పలువురు వ్యక్తులు కూడా ఈ శిథిలాల కింద చిక్కుకుపోయారు. 

గురువారం మార్చి 14న జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలుసహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 31 మంది తీవ్రంగా  గాయపడ్డారు. ఈ సమాచారం అందుకుని వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న సహాయక బృందం గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్, మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్, సీఎం ఫడ్నవీస్‌ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Kasab
Foot Overbridge
Pakistan
Terrorist
Mumbai
Accident
Six People's Dead

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు