మహర్షిని మీట్ అయిన దేవ్

Submitted on 13 February 2019
Karthi on the sets of Maharshi- 10TV

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 25వ సినిమా, మహర్షి.. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో, అశ్వినీ దత్, పి.వి.పి, దిల్ రాజు నిర్మిస్తుండగా, అల్లరి నరేష్, మహేష్ ఫ్రెండ్‌గా, పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం మహర్షి షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుంది.. రీసెంట్‌గా కన్నడ యంగ్ హీరో శ్రీ మురళి, మహర్షి సెట్‌లో మహేష్‌ని కలిసిన పిక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. శ్రీ మురళితో పాటు, డైలాగ్ కింగ్ సాయి కుమార్ కూడా ఉన్నాడు ఫోటోల్లో..

ఇప్పుడు యంగ్ హీరో కార్తీ, మహర్షి  లోకేషన్‌లో మహేష్‌ని కలిసాడు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి, మహేష్, కార్తీ కలిసి ఉన్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కార్తీ, వంశీ డైరెక్ట్ చేసిన ఊపిరి మూవీలో నటించిన సంగతి తెలిసిందే.. ఇటీవలే మహర్షి డబ్బింగ్ వర్క్ కూడా మొదలైంది.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న మహర్షి, ఏప్రిల్‌25న రిలీజ్ కానుంది.

Mahesh Babu
Allari Naresh
Pooja Hegde
Vamsi Paidipally

మరిన్ని వార్తలు