జనవరి 14న ఆడియో - ఫిబ్రవరి 14న సినిమా

Submitted on 12 January 2019
Karthi Dev [Telugu] Audio Release on Jan14th-10TV

కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ హీరో, హీరోయిన్స్‌గా, రజత్ రవిశంకర్ డైరెక్షన్‌లో, ఎస్.లక్ష్మణ్ కుమార్ తమిళ్‌లో నిర్మిస్తున్న సినిమా, దేవ్. తెలుగులో అదే పేరుతో ఠాగూర్ మధు రిలీజ్ చెయ్యనున్నాడు. ఇంతకుముందు రిలీజ్ చేసిన దేవ్ ఫస్ట్ లుక్, టీజర్‌కీ మంచి రెస్పాన్స్ వస్తోంది. కొద్ది రోజుల క్రితం తమిళ్ ఆడియో రిలీజ్ అయ్యింది. తెలుగు ఆడియోని జనవరి 14న రిలీజ్ చెయ్యబోతున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న దేవ్ మూవీని రిలీజ్ చెయ్యనున్నారు. ఖాకీ తర్వాత కార్తీ, రకుల్ నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.

ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, విఘ్నేష్, అమృత, కార్తీక్ ముత్తురామన్, నిక్కీ గల్రానీ, రేణుక, వంశీకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం : హారిస్ జయరాజ్, లిరిక్స్ : థమరై, కబిలన్, వివేక్, రజత్, ఎడిటింగ్ : రూబెన్, కెమెరా : ఆర్ వేల్‌రాజ్.

 

వాచ్ టీజర్...

Dev
Karthi
Rakul Preet Singh
Harris Jayaraj
Rajath RaviShankar

మరిన్ని వార్తలు