క్యాబ్ సర్వీసులకు బ్రేక్ : 6 నెలలు Ola లైసెన్స్ రద్దు

Submitted on 22 March 2019
Karnataka Transport Department has ordered the cancellation of Ola Cabs

రూల్ ఈజ్ రూల్ అంటున్నారు కర్ణాటక ఆర్టీఏ శాఖ. నిబంధనలు అతిక్రమిస్తే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని అంటున్నారు అక్కడి అధికారులు. దేశంలో దూసుకపోతున్న ట్యాక్సీ యాగ్రిగేటర్ సంస్థల్లో ‘Ola’ ఒకటి. దీనిపై కర్ణాటక రవాణా శాఖ కొరడా ఝులిపించింది. ఆ కంపెనీ లైసెన్స్ 6 ఏళ్ల పాటు రద్దు చేసింది. ఓలా కంపెనీ ట్యాక్సీల్లోనే కాకుండా బైక్‌ సర్వీసులను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Read Also : బాబోయ్ ఇదేం వైవిధ్యం : కత్తులు, పాములతో బాడీ మసాజ్

ఓలా యాజమాన్యం నిబంధనలను అతిక్రమిస్తోందని తమకు ఫిర్యాదు రావడంతో వాటిపై నిఘా పెట్టడం జరిగిందని ఓ అధికారి పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టగా రూల్స్ అతిక్రమిస్తోందని స్పష్టమైందని, మొదటగా నోటీసు ఇవ్వడం జరగిందన్నారు. కంపెనీ ఇచ్చిన వివరణతో సంతృప్తికరంగా లేదని, దీనితో వెంటనే  సర్వీసులను నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. రూల్స్‌ను అతిక్రమిస్తున్నందునే ఓలా లైసెన్సును ఆర్నెళ్ల పాటు రద్దు చేశారు. ఆర్డర్ కాపీ అందిన మూడు రోజుల్లోనే లైసెన్సును సరెండర్ చేయాలని ఆదేశించారు. 

2010లో ముంబైలో ఓలా కార్యకలాపాలు ప్రారంభించింది. బెంగళూరులో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసింది. కర్ణాటక రాష్ట్రంలో 10వేల క్యాబ్స్ తిరుగుతున్నాయి. మైసూరు, మంగళూరు, హుబ్లీ, బెంగళూరులో సర్వీసులను నడుపుతోంది.
Read Also : సీటు గోవిందా..! : సిట్టింగ్‌లకు నో ఛాన్స్

karnataka
Transport
Department
ordered
Cancellation
Ola Cabs
rta

మరిన్ని వార్తలు